అక్షయ్ కుమార్ బ్లాక్ బస్టర్ హిట్ చూసి రేండెళ్లు దాటిపోతోంది. ఓఎంజీ2 తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు. ఇక లాస్ట్ ఇయర్ బడే మియా చోటా మియా, సర్ఫీరా, ఖేల్ ఖేల్ మే డిజాస్టర్స్. గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సింగం ఎగైన్ యావరేజ్ టాక్. ఈ ఏడాదైనా కంబ్యాక్ అవ్వాలని చేసిన ప్రయత్నాలు వృధాగా మారిపోయాయి. హిట్స్‌కు అడుగు దూరంలో ఆగిపోయాయి స్కై ఫోర్స్, కేసరి చాప్టర్2, హౌస్ ఫుల్5, జాలీ ఎల్ ఎల్బీ3 చిత్రాలు. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కాసులు రాబట్టుకోలేకపోయాయి. ఇక టాలీవుడ్ ఫిల్మ్ కన్నప్ప సంగతి ఎంత తక్కువ చర్చించుకుంటే అంత మంచిది.
Also Read : NBK 111 : బాలయ్య సరసన ‘యువరాణి’ని ప్రకటించేందుకు ముహూర్తం ఫిక్స్..
సీక్వెల్స్ దింపినా, ఇద్దరు ముగ్గురు హీరోలతో వస్తున్నా.. కామెడీ చేస్తున్నా, యాక్షన్ ఎంటర్టైనర్లతో దిగుతున్నా ఖిలాడీ హీరో సక్సెస్ చూడలేకపోతున్నాడు. ఇక ఇలా కాదని.. తనకు ఒకప్పుడు హిట్టిచ్చి.. ఈ రేంజ్‌కు చేర్చిన ఇద్దరు ఓల్డ్ దర్శకుల్ని మళ్లీ అప్రోచ్ అయ్యాడు అక్షయ్. మాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ప్రియదర్శన్ – అక్షయ్ కాంబోలో హేరా పేరీ, గరమ్ మసాలా, భాగమ్ భాగ్, భూల్ భూలయ్యా, కట్టా మీటా చిత్రాలొచ్చాయి. మళ్లీ ఈ కొలాబరేషన్ సెట్ కాలేదు. 14ఏళ్లకు ఈ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. ఒకటి కాదు మూడు సినిమాలకు వర్క్ చేస్తున్నాడు ప్రియదర్శన్,. భూత్ బంగ్లాతో పాటు హైవాన్, హేరాఫేరీ3ని డీల్ చేసే బాధ్యతను ఈ మలయాళ దర్శకుడికి అప్పగించాడు ఈ హీరో. ప్రియదర్శన్ మాత్రమే కాదు మరో పాత దర్శకుడ్ని రిపీట్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్. మరో హిట్ మేకర్ అనీస్ బజ్మీతో కూడా 14 ఏళ్ల తర్వాత టయ్యప్ అయ్యాడు ఖిలాడీ యాక్టర్. వెల్కమ్, సింగ్ ఈజ్ కింగ్, థాంక్యూ చిత్రాలతో తనకు సక్సెస్ ఇచ్చిన అనీస్ దర్శకత్వంలో డబుల్ ఫోజులో అక్షయ్ నటించనున్నాడన్న వార్తలు వస్తున్నాయి కానీ హీరో క్లోజ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఫ్యామిలీ కామెడీ డ్రామాతో వస్తున్నాడట. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నిర్మించే ఛాన్స్ ఉందన్న బజ్ నడుస్తుంది. మరి డైరెక్టర్- హీరో కాంబో వర్కౌటై అక్షయ్ హిట్ అందుకుని ఖిలాడీ ఈజ్ బ్యాక్ అనిపించుకుంటాడో లేదో చూడాలి.
