Site icon NTV Telugu

Comedians Special : హీరోలుగా సక్సెస్ కాలేకపోతున్న స్టార్ కమెడియన్స్

Comedians

Comedians

తెరపై స్కోప్ తక్కువున్నప్పటికి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటారు కమెడియన్స్. వీరి కామెడీ పటాసుల్లా పేలి సినిమా సక్సెస్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా అని సినిమా మొత్తం మేమే ఉంటాం అంటే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. కమెడియన్లు హీరోలుగా ఛేంజ్ అవుతుంటే. బ్రహ్మానందం నుండి సంతానం వరకు ఇదే జరిగింది.. జరుగుతోంది. బ్రహ్మీ జోకులను థియేటర్లలో ఎంజాయ్ చేసిన ప్రేక్షకుడు హీరోగా మారితే జీర్ణించుకోలేకపోతున్నాడు. సునీల్ కూడా జక్కన్న వల్ల లీడింగ్ యాక్టర్ గా మారి కామెడీ వదిలేస్తే హీరోగా కొన్ని చిత్రాలకే పరిమితమయ్యాడు. ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి సెకండ్ ఇన్నింగ్స్‌లో టాలీవుడ్, కోలీవుడ్‌లో బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. పుష్ప2లో సీరియస్ క్యారెక్టర్ చేసి మ్యాడ్ స్క్వేర్‌లో భాయ్‌గా నవ్వులు పువ్వులు పూయించాడు సునీల్.

Also Read : Toxic : పాన్ వరల్డ్ లాంగ్వేజెస్ లో టాక్సిక్.. హాలీవుడ్ వుడ్ పై కన్నేసిన యష్

ఇక కోలీవుడ్ బ్రహ్మీ వడివేలు కూడా హీరోగా మారి యూటర్న్ తీసుకున్నాడు. మామన్నన్‌లో సీరియర్ క్యారెక్టర్ చేసి ఇప్పుడు గ్యాంగర్స్‌తో వింటేజ్ కామెడీతో ప్రేక్షకులకు కితకితలు పెట్టబోతున్నాడు. వడివేలు తర్వాత తమిళనాట బాగా క్లికైన కమెడియన్ సంతానం. ఓ వైపు హీరోకు ఫ్రెండ్ క్యారెక్టర్ మరో వైపు కామెడీని పండించాడు. కానీ హిడెన్ టాలెంట్ దర్శకులు గుర్తించారని లీడింగ్ యాక్టరైతే పట్టించుకోవడం లేదు ప్రేక్షకులు. ఇక సెట్ కావట్లేదని గ్రహించిన సంతానం బ్యాక్ టు ది పెవిలియన్. శింబు 49 చిత్రంలో కామెడీ రోల్ చేస్తున్నాడు. అలా అని రెమ్యునరేషన్ తక్కువ తీసుకుంటున్నాడా అంటే కోట్లలో పుచ్చుకుంటున్నాడన్నది లేటెస్ట్ బజ్. ఇక యోగి బాబు తనేంటో తనకు తెలుసు అందుకే హీరోగా చేస్తూనే  కమెడియన్‌గానూ కంటిన్యూ అవుతున్నాడు.

Also Read : Nithiin : అరడజనుకుపైగా ప్లాపులు.. రిలీజ్ కు రెడీగా మరో సినిమా

ఇక సూరి.. గరుడన్‌తో సీరియస్ క్యారెక్టర్లకు షిఫ్టైన మళ్లీ వెనక్కు రాలేకపోతున్నాడు. హీరోగా ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నాడు. మామన్ త్వరలో రిలీజ్ కాబోతుంది. తెరపై కామెడీతో పెదాలపై స్మైల్స్ మెరిసేలా చేసి మీమర్లకు గాడ్స్‌గా మారిన కమెడియన్స్ హీరోగా స్టెబిలిటీ చూపించలేకపోతున్నారు. సెటాఫ్ ఆడియన్స్ వీరి దగ్గర నుండి కామెడీ వైబ్ కోరుకుంటుండటంతో.. హీరోయిన్లతో రొమాన్స్, విలన్లు చితక్కొట్టేస్తుంటే టికెట్స్ తెగట్లేదు. ఇప్పుఇప్పుడే హీరోగా ఎదుగుతున్న సూరి ఈ రూల్స్ బ్రేక్ చేసి హీరోగా స్టాండడ్ అవుతాడేమో చూడాలి.

Exit mobile version