Site icon NTV Telugu

Mahesh Babu: సీక్రెట్‌గా మహేష్ జంప్.. ప్రియాంక పట్టించేసిందిగా!

Mahesh Babu

Mahesh Babu

టాలీవుడ్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ అంచనాలు నెలకొన్న, ఎస్‌.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 29 ‘గ్లోబ్‌ట్రాటర్‌’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ కెన్యాలో ప్రారంభమయ్యేందుకు అంతా సిద్ధమైంది. ఈ చిత్రంలో నటిస్తున్న ప్రియాంక చోప్రా కెన్యాకు బయలుదేరిన ఫొటోలను తన సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్త ఖరారైంది. ప్రయాణంలో ఆమె కెన్యాలో లభించే ‘కెన్యాన్ చెవ్డా’ అనే ప్రముఖ ఇండియన్ స్నాక్‌ను చూసి ఆశ్చర్యపోయినట్లు ఓ ఫొటోను షేర్ చేసింది. దీని ద్వారా ‘గ్లోబ్‌ట్రాటర్‌’ షూటింగ్‌ తూర్పు ఆఫ్రికాలోని కెన్యాలో అధికారికంగా మొదలైందని స్పష్టమైంది.

Also Read :Akhanda 2: ఇట్స్ అఫీషియల్.. అఖండ 2 వాయిదా

ఈ చిత్రంతో ఇటీవల గణేష్ చతుర్థి వేడుకలకు మహేష్ బాబు ఎందుకు దూరమయ్యారో అనే సందేహాలకు ఇప్పుడు సమాధానం దొరికింది. మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్‌ సైతం పండుగ ఫొటోలను పంచుకుంటూ మహేష్‌ను మిస్ అవుతున్నామని పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్‌ కోసమే మహేష్‌బాబు కెన్యా వెళ్లినట్లు అది కూడా సీక్రెట్ గా కెమెరాల కంట పడకుండా వెళ్లినట్టు తెలుస్తోంది.

Also Read :Akhanda 2: ఇట్స్ అఫీషియల్.. అఖండ 2 వాయిదా

ఈ సినిమా బృందం కెన్యాలోని ఒక నేషనల్ పార్క్‌లో సాహస సన్నివేశాలను చిత్రీకరించేందుకు సిద్ధమవుతోంది. ఆ దేశంలోని అద్భుతమైన వన్యప్రాణుల మధ్య ఈ భారీ యాక్షన్ సన్నివేశాలను తీయనున్నారు. వాస్తవానికి, రాజమౌళి గత నెలలోనే షూటింగ్ మొదలుపెట్టాలని అనుకున్నప్పటికీ, కెన్యాలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా సినిమా వాయిదా పడింది. ఇప్పుడు షూటింగ్ ప్రారంభం కావడంతో, ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Exit mobile version