Site icon NTV Telugu

SSMB 29: కొత్త షెడ్యూల్.. ఎప్పుడు? ఎక్కడ అంటే?

Ssmb 29

Ssmb 29

సూపర్‌స్టార్ మహేష్ బాబు -దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB 29 గురించి సినీ అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ దశలో అనేక ఆసక్తికర అప్‌డేట్స్‌తో వార్తల్లో నిలిచింది. ఇక షూట్ కూడా మొదలు పెట్టగా షూట్ గురించి అనేక వార్తలు తెరమీదకు వచ్చాయి. తాజాగా, సమ్మర్ వెకేషన్ అనంతరం ఈ సినిమా షూటింగ్ మరో కీలక షెడ్యూల్‌తో ప్రారంభం కానుందని సమాచారం.

Also Read:RT 76: రవితేజతో డిజాస్టర్ కొట్టిన నిర్మాత మరో సినిమా.. రేపే ఓపెనింగ్

జూన్ 10, 2025 నుంచి వారాణసిలోని సెట్స్‌లో ఈ షెడ్యూల్ మొదలవనుందని తెలుస్తోంది. నిజానికి SSMB 29 చిత్రీకరణ ఇప్పటికే ఒడిశాలోని కోరాపుట్‌లో జరిగిన షెడ్యూల్‌తో వార్తల్లో నిలిచింది. అక్కడ జరిగిన షూటింగ్‌లో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో పాటు ప్రియాంక చోప్రా కూడా పాల్గొన్నారని వీడియో లీక్స్ తో క్లారిటీ వహ్హ్యింది. ఇక ఇప్పుడు, సమ్మర్ వెకేషన్ తర్వాత, ఈ భారీ ప్రాజెక్ట్ వారాణసిలోని సెట్స్‌లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనుంది.

Also Read:Asian Max: బాలాపూర్‌లో ఏషియన్ మ్యాక్స్ థియేటర్ కాంప్లెక్స్ ప్రారంభం

ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు రాజమౌళి బృందం సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఒక జంగిల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతోందని, ఇందులో పౌరాణిక అంశాలు కూడా ఉంటాయని అంటున్నారు. రాజమౌళి గత చిత్రాలైన బాహుబలి మరియు RRRలాగానే, ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో (సుమారు 1000 కోట్ల రూపాయలు) తెరకెక్కుతోంది. మహేష్ బాబు ఈ చిత్రంలో ఒక కొత్త లుక్‌లో కనిపించనున్నారు.

Exit mobile version