సినిమా అవుట్‌పుట్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దాన్ని ఎన్నో రోజులపాటు చెక్కుతాడని రాజమౌళికి పేరు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ముద్దుగా ఆయన్ని జక్కన్న అని పిలుస్తూ ఉంటాడు. అదే వాడుకలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి రాజమౌళి మహేష్ బాబుతో ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ(SSMB29) చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ కెన్యాలో ప్లాన్ చేస్తున్నారు.
Also Read:Nidhhi Agerwal : వేరే వంద సినిమాలు చేసినా పవన్ తో ఒక్క సినిమా చేసినా ఒకటే!
అయితే ఈ నెలలోనే కెన్యా వెళ్లి షూటింగ్ చేయాల్సినది కానీ అక్కడ కొన్ని లోకల్ సమస్యల కారణంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో షూట్ కాస్త వాయిదా పడింది. ఈ బ్రేక్ దొరకడంతో రాజమౌళి స్క్రిప్ట్ మీద మళ్లీ ఫోకస్ చేసి దాన్ని ఫైన్ ట్యూన్ చేసే పనులు పడ్డాడని అంటున్నారు. ఇప్పటికే రాజమౌళి, మహేష్ కొన్ని మార్పులు, చేర్పుల గురించి డిస్కషన్ చేయగా, రాజమౌళి టీం దానికి తగ్గట్టుగా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.
Also Read:BAN vs SL: శ్రీలంక గడ్డపై చరిత్రను తిరగరాసిన బంగ్లా టైగర్లు.. తొలి టీ20 సిరీస్ గెలుపు..!
తాజాగా అందుతున్న సమాచారం మేరకు సౌత్ ఆఫ్రికాలో వచ్చే నెలలో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు క్లారిటీ వచ్చింది. సినిమాకి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జక్కన్న అండ్ టీం జాగ్రత్త పడుతోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
