Srikanth Odela: ‘దసరా’ కేజీఎఫ్ కాదన్న నిరాశను తుడిచేయడానికే నానితో ‘ప్యారడైజ్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘దసరా’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, తన తదుపరి చిత్రం ‘ది ప్యారడైజ్’తో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా జరిగిన మీడియా ముఖాముఖిలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
‘దసరా’ సినిమా సమయంలో ప్రమోషన్ల ద్వారా వచ్చిన హైప్ వల్ల ప్రేక్షకులు కేజీఎఫ్ తరహా పూర్తి స్థాయి ఊచకోత సినిమా ఆశించి వచ్చారని, తీరా థియేటర్లో వెన్నెల ప్రేమకథ, డ్రామా చూసి మొదట్లో తీవ్ర నిరాశ చెందారని శ్రీకాంత్ కుండబద్దలు కొట్టారు. నానితో సినిమా బ్లాక్‌బస్టర్ అయినా కూడా ప్రేక్షకులు ఊహించిన ఆ మాస్ సంతృప్తిని పూర్తిగా ఇవ్వలేకపోయామన్న చిన్న లోటు మిగిలిందని, అందుకే నానితో కలిసి మళ్లీ ‘ప్యారడైజ్’ మొదలుపెట్టానని వెల్లడించారు.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఈ చిత్రంలో నాని క్యారెక్టర్‌ను మునుపెన్నడూ చూడని విధంగా రెండు జడల గెటప్‌లో డిజైన్ చేశారు. తన చిన్నతనంలో అమ్మ తనకి జడలు వేసిన జ్ఞాపకం నుంచే ఈ కాన్సెప్ట్ పుట్టిందని, ఆదిలాబాద్ నేపథ్యంలోని కొన్ని యదార్థ సంఘటనల స్ఫూర్తితో గోదావరిఖని కల్చర్‌ను జోడించి ఈ కథ రాసుకున్నానని పేర్కొన్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు ప్రధాన విలన్‌గా కీలక పాత్ర పోషిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారని, కథ పరంగా ఎటువంటి రీషూట్స్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!