Sreeleela : శ్రీలీలను వెంటాడుతున్న దురదృష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలీల తెలుగులో రెండేళ్ల క్రితం ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ఉస్తాద్’ ఫ్లాప్ కావడంతో తెలుగు మేకర్స్ శ్రీలీలను పక్కన పెట్టేశారు. అసలు శ్రీలీల అనే హీరోయిన్ ఉన్న సంగతినే మర్చిపోయారు. ‘పరాశక్తి’ మూవీతో తమిళంలోకి అడుగుపెట్టి శివకార్తికేయన్‌తో జతకట్టింది. ‘పరాశక్తి’ ఫ్లాప్ అయినా, ‘ఓం చాప్టర్ 1’లో ధనుష్‌తో జతకట్టే ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో సాయి పల్లవి కూడా ఉండడంతో శ్రీలీలది ఇంపార్టెంట్ రోల్ అవునో కాదో తెలియాల్సి ఉంది.
శ్రీలీల కెరీర్ హైప్లో ఉన్నప్పుడే అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తున్న హిందీ మూవీకి సైన్ చేసి, కార్తీక్ ఆర్యన్‌తో జతకట్టింది. వీళ్ళిద్దరి మధ్య ఎఫైర్ వార్తలు రావడం తప్ప, మూడేళ్లయినా సినిమా పూర్తి కాలేదు. శ్రీలీల పార్ట్ షూటింగ్ పూర్తయినా, రీషూట్స్ కోసం డేట్స్ అడుగుతున్నారని తెలిసింది. శ్రీలీల తొలి హిందీ సినిమా కథ హిట్ మూవీ ‘సయారా’కు దగ్గరగా ఉండడంతో స్టోరీలో మార్పులు చేశారని, రీషూట్ చేస్తారని తెలిసింది. ఇలా శ్రీలీల డెబ్యూ మూవీ డైలమాలో పడింది.
Also Read
- Vishwanath and Sons: ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తే రిజల్ట్ ఇలా ఉంటుందా?
- Mega158: 2027 సంక్రాంతి బరిలో మెగాస్టార్
- The Revolutionaries OTT: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నలుగురు వీరులు.. ఓటీటీలోకి హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ సిరీస్
- Irumudi Censor : మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఎంతంటే?
మూడేళ్లుగా పూర్తి కాని లవ్ స్టోరీ థియేటర్స్‌లోకి వచ్చి హిట్ అయితే గానీ శ్రీలీలకు మరో హిందీ ఆఫర్ రాదు. అప్పటివరకు తమిళంలో ఉన్న ఏకైక చిత్రంతో సరిపెట్టుకోవాల్సిందే. శ్రీలీల అంటే డ్యాన్సులకే పరిమితమైపోతుంది. ఏ రోల్ చేసినా పెర్ఫార్మెన్స్కు స్కోప్ ఉండదు, కెరీర్‌కి ఉపయోగపడే మూవీ ఒక్కటీ లేదు. శ్రీలీల కెరీర్లో ‘పెళ్లి సందడి’, ‘ధమాకా’ వంటి రెండు హిట్స్ తప్ప ముచ్చటగా చెప్పుకోవడానికి హిట్ లేదు. కథ, క్యారెక్టర్ గురించి ఆలోచించకుండా ముందునుంచీ సినిమాల మీద సినిమాలు చేసేసి ఐరన్ లెగ్ ముద్ర కొనితెచ్చుకుంది శ్రీలీల. ఇక మీదట అయినా సరిగా ఫోకస్ చేసి సినిమాలను ఎంచుకోక పోతే ఇక ఫేడ్ ఔట్ అయిపోవడం పెద్ద విషయం ఏమీ కాదు.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీలను వెంటాడుతున్న దురదృష్టం
-
Vishwanath and Sons: ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తే రిజల్ట్ ఇలా ఉంటుందా?
-
Imran Khan: తక్షణమే ఇమ్రాన్‌ఖాన్‌ను ఆస్పత్రికి తరలించండి.. సుప్రీంకోర్టు ఆదేశం
-
Mega158: 2027 సంక్రాంతి బరిలో మెగాస్టార్
-
AP Cabinet Decisions 2026: బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. 34 శాతం అమలుకు గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!