Sreeleela : శ్రీలీలను వెంటాడుతున్న దురదృష్టం

Sreeleela

Sreeleela

శ్రీలీల తెలుగులో రెండేళ్ల క్రితం ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ఉస్తాద్’ ఫ్లాప్ కావడంతో తెలుగు మేకర్స్ శ్రీలీలను పక్కన పెట్టేశారు. అసలు శ్రీలీల అనే హీరోయిన్ ఉన్న సంగతినే మర్చిపోయారు. ‘పరాశక్తి’ మూవీతో తమిళంలోకి అడుగుపెట్టి శివకార్తికేయన్‌తో జతకట్టింది. ‘పరాశక్తి’ ఫ్లాప్ అయినా, ‘ఓం చాప్టర్ 1’లో ధనుష్‌తో జతకట్టే ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో సాయి పల్లవి కూడా ఉండడంతో శ్రీలీలది ఇంపార్టెంట్ రోల్ అవునో కాదో తెలియాల్సి ఉంది.

శ్రీలీల కెరీర్ హైప్‌లో ఉన్నప్పుడే అనురాగ్ బసు డైరెక్ట్ చేస్తున్న హిందీ మూవీకి సైన్ చేసి, కార్తీక్ ఆర్యన్‌తో జతకట్టింది. వీళ్ళిద్దరి మధ్య ఎఫైర్ వార్తలు రావడం తప్ప, మూడేళ్లయినా సినిమా పూర్తి కాలేదు. శ్రీలీల పార్ట్ షూటింగ్ పూర్తయినా, రీషూట్స్ కోసం డేట్స్ అడుగుతున్నారని తెలిసింది. శ్రీలీల తొలి హిందీ సినిమా కథ హిట్ మూవీ ‘సయారా’కు దగ్గరగా ఉండడంతో స్టోరీలో మార్పులు చేశారని, రీషూట్ చేస్తారని తెలిసింది. ఇలా శ్రీలీల డెబ్యూ మూవీ డైలమాలో పడింది.

మూడేళ్లుగా పూర్తి కాని లవ్ స్టోరీ థియేటర్స్‌లోకి వచ్చి హిట్ అయితే గానీ శ్రీలీలకు మరో హిందీ ఆఫర్ రాదు. అప్పటివరకు తమిళంలో ఉన్న ఏకైక చిత్రంతో సరిపెట్టుకోవాల్సిందే. శ్రీలీల అంటే డ్యాన్సులకే పరిమితమైపోతుంది. ఏ రోల్ చేసినా పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉండదు, కెరీర్‌కి ఉపయోగపడే మూవీ ఒక్కటీ లేదు. శ్రీలీల కెరీర్‌లో ‘పెళ్లి సందడి’, ‘ధమాకా’ వంటి రెండు హిట్స్ తప్ప ముచ్చటగా చెప్పుకోవడానికి హిట్ లేదు. కథ, క్యారెక్టర్ గురించి ఆలోచించకుండా ముందునుంచీ సినిమాల మీద సినిమాలు చేసేసి ఐరన్ లెగ్ ముద్ర కొనితెచ్చుకుంది శ్రీలీల. ఇక మీదట అయినా సరిగా ఫోకస్ చేసి సినిమాలను ఎంచుకోక పోతే ఇక ఫేడ్ ఔట్ అయిపోవడం పెద్ద విషయం ఏమీ కాదు.