‘కింగ్ ఆఫ్ కంటెంట్’ శ్రీ విష్ణు టెన్షన్ ఎట్టకేలకు తీరిపోయింది. విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ ఒక్క రోజు వస్తాయని శ్రీ విష్ణు తెగ టెన్షన్ పడిపోయాడు. అందులోనూ బర్త్ డే టైంలోనే మూవీస్ వస్తుండడంతో.. టెన్షన్ మధ్య సరిగా నిద్ర కూడా పోలేదట. ఓటీటీ రైట్స్ ఇష్యూ వల్లే రెండు సినిమాలను ఒకే సారి దింపాల్సి వస్తుందని న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఈ కన్ఫ్యూజన్ కంక్లూజన్ తేలక శ్రీ విష్ణు సతమతమయ్యాడు. ఎట్టకేలకు ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఈ ఫిబ్రవరిలో ఒకటి.. మార్చిలో మరో మూవీ రిలీజ్ చేస్తున్నాడు.
Also Read: Krishna Burugula: 100 కథలు విన్న యువ హీరో.. బెస్ట్ స్క్రిప్ట్ కోసం వెయిటింగ్!
కామెడీ ఎంటర్టైనర్ విష్ణు విన్యాసం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ మృత్యుంజయ్ తొలుత ఫిబ్రవరి 27న రిలీజ్ అనుకోగా.. ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యింది. మూవీ మార్చి 6కి వాయిదా పడింది. రీసెంట్లీ విష్ణు విన్యాసం టీజర్ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించాడు కానీ.. ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. సామజవరగమన తర్వాత రెబా జాన్‌తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు శ్రీ విష్ణు. ఈ ఫిల్మ్‌కి హుస్సేన్ షా కిరణ్ దర్శకుడు. వరుస ఫన్ సినిమాలతో అలరిస్తున్న హీరో.. ఇందులో సీరియస్ లుక్ ట్రై చేస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయడానికి ఓటీటీ ఒక్కటే కారణం కాదన్న హీరో.. ఇంకేదో రీజన్ ఉందంటున్నాడు. త్వరలో అసలు విషయాన్ని వెల్లడిస్తాడట.
