శ్రీ విష్ణు, హసిత్ గోలి కాంబినేషన్ లో వచ్చిన రాజా రాజ చోర సినిమాకి మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెం 32గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా రేపు అధికారికంగా ప్రకటించి టైటిల్ రివీల్ చేయనున్నారు. హీరో శ్రీవిష్ణు మరియు దర్శకుడు హసిత్ గోలీ కలిసి రాజా రాజ చోరాతో కలిసి తమ మొదటి సినిమాతో నవ్వుల పువ్వులు పూయించారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెంబర్ 32గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది.
Also Read; Vyooham: ఎట్టకేలకు వ్యూహం సినిమాకి గ్రీన్ సిగ్నల్
ఇక అనౌన్స్మెంట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా టైటిల్‌ని రేపు శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ప్రకటించనున్నారు. ఇక స్వచ్ఛమైన తెలుగు సినిమా అని చెబుతూ టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ కు నామకరణం ఈవెంట్ అని పేరు పెట్టారు. ఇది స్వచ్ఛమైన తెలుగు సినిమా అని చెప్పడమే ఉద్దేశంగా చెబుతున్నారు. “వెయిట్ అప్! మీరు సంతృప్తి చెందుతారు,” అని పోస్టర్ లో పేర్కొన్నారు. రాజా రాజా చోరతో ఆకట్టుకునే సినిమాతో దర్శకుడిగా మారిన హసిత్ గోలీ శ్రీవిష్ణును మరో ఆసక్తికరమైన పాత్రలో మన ముందుకు తీసుకురానున్నారు. శ్రీవిష్ణు సమాజవరగమనతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి మాంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రేపు ప్రకటించనున్నారు. ఇక స్వాగ్ SWAG అనే టైటిల్ తో ఈ సినిమా రానుందని తెలుస్తోంది.