Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deewana: దీవాన ‘థ్యాంక్యూ మీట్’కు గెస్ట్‌గా విచ్చేసిన హీరో శ్రీవిష్ణు ఆడియెన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఈ హీరోకి దీవాన చిత్రం బాగా నచ్చడంతో.. రేపు శనివారం దీవాన మూవీ ఆడుతున్న ప్రతి థియేటర్లో మొదటి పాతిక టికెట్లకు “ఒకటి కొంటే మరొక టికెట్ ఉచితం” అనే ఆఫర్ ప్రకటించేశాడు. దీంతో ఈ సినిమా ఇక మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యి, అటు మౌత్ పబ్లిసిటీతో పాటు, ఇటు సినిమా చూసిన వాళ్లు ఇచ్చే పాజిటివ్ రివ్యూతో సినిమాకు మంచి థియేట్రికల్ రన్ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక తనతో ‘సింగిల్’ చిత్రాన్ని నిర్మించిన లేడీ ప్రొడ్యూసర్ విద్య కొప్పినీడి కోరిక మేరకు, నిన్న సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన ఈ హీరో.. ఇంటర్వెల్లో వచ్చిన ట్విస్ట్‌కి ఒక్కసారిగా చిప్ ఎగిరిపోయి, పనులు మానుకొని మరీ సెకండ్ హాఫ్ చూడడం జరిగిందని దీవాన థ్యాంక్యూ మీట్ వేదికగా ఈ కామెడీ హీరో వెల్లడించారు. అలాగే ఈ మూవీ తీసిన దర్శకుడికి ఎంత టాలెంట్ ఉందో, అంతే టాలెంట్ ఉన్న టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్స్ దొరకడంతో సినిమా చాలా బాగా వచ్చిందని; ఒకానొక సందర్భంలో సినిమాలోని పాత్రల మీద సైతం కోపం వచ్చిందని, అలా అన్ని సినిమాలకు జరగదని, మనం సినిమాను ఫీల్ అయినప్పుడే అది జరుగుతుందని, ఆ ఫీల్ తనకు ఈ దీవాన చిత్రంతో సంపూర్ణంగా కలిగిందని హీరో శ్రీవిష్ణు అన్నారు.
Also Read
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
- Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
- Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
అలాగే ఈ మూవీని నిర్మించిన వాసుదేవ్ కొప్పినీడి, శ్రీదేవి కార్యంపూడి నిర్మాతలకు ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ వంటి దిగ్గజ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తోడవడం సినిమాకు మరింత కలిసొచ్చే అంశంగా మారిందని ఆయన అన్నారు. హీరో హర్షిత్ రెడ్డి నటన ఈ చిత్రంలోనే కాదు, అతను యాక్ట్ చేసే ప్రతి చిత్రంలోనూ చాలా న్యాచురల్ గా ఉంటుందని అన్నారు. ఇక ఈ మూవీలో హీరోకి ఫ్రెండ్ పాత్ర పోషించిన శివరామ్ శంకర్.. గతంలో తనను సినిమా ఛాన్స్ అడిగేందుకు వస్తే చదువుకుని రమ్మని చెప్పి పంపించడం జరిగిందని, ఇప్పుడు ఆ అబ్బాయి హిట్ కొట్టి నా ముందు నిలబడ్డాడు కాబట్టి ఫ్యూచర్లో తనకు మంచి అవకాశం ఇస్తానని హీరో శ్రీవిష్ణు అన్నారు.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!