SriGouriPriya: ‘మిస్ హైదరాబాద్’ నుంచి హీరోయిన్ వరకు.. తన జర్నీ గురించి చెప్పిన చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SriGouriPriya: ఇటీవల విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, చదువు, సంగీతంపై గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ టీవీ యాంకర్‌గా పనిచేయలేదని, చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం, లలిత సంగీతం నేర్చుకుంటూ పెరిగానని అన్నారు. ప్రొఫెషనల్ సింగర్‌గా మారకపోయినా, పలు రియాలిటీ షోలలో పాల్గొన్నానని చెప్పారు. ఆ కార్యక్రమాల ద్వారానే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీపై కొంత అవగాహన వచ్చిందని వెల్లడించారు.
2018లో ‘మిస్ హైదరాబాద్’ టైటిల్ గెలుచుకోవడం తన జీవితంలో కీలక మలుపు అని, ఆ తర్వాత కరోనా కారణంగా రెండేళ్ల విరామం వచ్చినట్లు చెప్పారు. కోవిడ్ సమయంలోనే ఆహాలో వచ్చిన ‘మెయిల్’ వెబ్‌సిరీస్‌తో తనకు తొలి అవకాశం లభించిందని, అక్కడి నుంచే వరుసగా సినిమా అవకాశాలు రావడం ప్రారంభమైందన్నారు. తాను హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (BMS) పూర్తి చేశానని, మార్కెటింగ్, మేనేజ్మెంట్ అంశాలపై తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని చెప్పారు. అయితే హీరోయిన్ అవుతానని కూడా ఎప్పుడూ ఊహించలేదని, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు చదువుతో పాటు ఒక అదనపు నైపుణ్యం ఉండాలని భావించి సంగీతం నేర్పించారని చెప్పారు. అలాగే డిబేట్స్, ఎలక్యూషన్స్, డ్యాన్స్, స్పోర్ట్స్ వంటి ప్రతి పోటీలో పాల్గొనేదానినని తెలిపారు. అందువల్లే స్టేజ్ ఫియర్ ఎప్పుడూ రాలేదని, పాల్గొనడమే ముఖ్యమనే ఆలోచన చిన్న వయసులోనే అలవడిందన్నారు. ఇక భవిష్యత్తులో సినిమాల్లో పాట పాడే అవకాశం వస్తే తప్పకుండా పరిశీలిస్తానని అన్నారు. అయితే అది దర్శకులు, నిర్మాతల నిర్ణయమని, సరైన సమయం వచ్చినప్పుడు ఆ అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
iPhone 18 Pro సిరీస్ వచ్చేసింది..బ్యాటరీ, ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే
-
iPhone Prices Hiked: iPhone 18 Pro సిరీస్ లాంచ్ ఎఫెక్ట్.. iPhone 17, iPhone Air, iPhone 17e ధరలు భారీగా పెంపు!
-
Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!