Hardik Pandya: పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీపై హార్దిక్ క్లారిటీ.. జట్టు సారథి ఎవరో చెప్పేసిన పాండ్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya: ఐపీఎల్లో (IPL) ఊహించని సంచలనం నమోదైంది. ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ (Punjab Kings), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మధ్య మెగా ట్రేడింగ్ డీల్ కంప్లీట్ అయింది. దీని ప్రకారం రూ. 18 కోట్ల భారీ ఫీజుతో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ముంబై జట్టును వీడి పంజాబ్ కింగ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక పంజాబ్ నుంచి స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) ముంబై ఇండియన్స్ జట్టులోకి వెళ్లాడు. ముంబైకి గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్.. ఇప్పుడు పంజాబ్ జట్టులోకి రావడంతో అక్కడ కెప్టెన్సీ ఎవరికి ఇస్తారనే దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడిచింది. ఈ ఊహాగానాలన్నింటికి హార్దిక్ పాండ్యా తన సోషల్ మీడియా పోస్ట్‌తో ఫుల్స్టాప్ పెట్టేశాడు. “నా కెప్టెన్ శ్రేయస్, నా కోచ్ రికీ, నా టీమ్ పూరా పంజాబ్. నేను మీతో పాటు నిలబడతాను” అంటూ పోస్ట్ షేర్ చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ (Captaincy) బాధ్యతలు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) చేతిలోనే ఉంటాయని క్లారిటీ వచ్చేసింది.
గతంలో ముంబై ఇండియన్స్‌లోకి హార్దిక్ రీ-ఎంట్రీ ఇచ్చినప్పుడు కెప్టెన్సీ షరతు కూడా ఉందనే వార్తలు వచ్చాయి. ముంబై మేనేజ్మెంట్ అయిదుసార్లు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma) చేతి నుంచి కెప్టెన్సీ తప్పించి మరీ హార్దిక్‌కు పగ్గాలు అప్పగించింది. కానీ, ఆ సీజన్లో ముంబై టీమ్ ప్రదర్శన అంతంతమాత్రంగానే సాగింది. దీంతో పంజాబ్ డీల్ సమయంలో హార్దిక్ మళ్లీ కెప్టెన్సీ డిమాండ్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ, అలాంటి డ్రామా ఏదీ జరగలేదు. హార్దిక్ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోనే ఆడేందుకు సిద్ధమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ గతంలో పంజాబ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన తొలి సీజన్లోనే టీమ్‌ను ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. ఇప్పుడు టీమ్ కమాండ్ మార్చితే పంజాబ్ టీమ్ బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. పైగా హార్దిక్ కేవలం ఒక కీలక ఆటగాడిగా (Player) బరిలోకి దిగితే, కెప్టెన్సీ టెన్షన్ లేకుండా మరింత స్వేచ్ఛగా రాణించే వీలవుతుంది. మొత్తానికి హార్దిక్ నిర్ణయంతో పంజాబ్ క్యాంప్‌లో ఎలాంటి విభేదాలకు తావులేకుండా ప్రశాంత వాతావరణం నెలకొంది.
Also Read
- Jammu Kashmir: సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రదాడి..
- iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
- RGV Review: "నేనొక నాస్తికుడిని.. కానీ సినిమా ప్రేమికుడిగా చెబుతున్నా".. రామాయణంపై ఆర్జీవీ సెకండ్ రివ్యూ..!
- Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
తాజావార్తలు
-
Jammu Kashmir: సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రదాడి..
-
Hardik Pandya: పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీపై హార్దిక్ క్లారిటీ.. జట్టు సారథి ఎవరో చెప్పేసిన పాండ్యా..
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
RGV Review: “నేనొక నాస్తికుడిని.. కానీ సినిమా ప్రేమికుడిగా చెబుతున్నా”.. రామాయణంపై ఆర్జీవీ సెకండ్ రివ్యూ..!
-
ICICI Bank Loan Fraud: ICICI బ్యాంకుకు టోకరా.. ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా రూ.30 లక్షల లోన్!
ట్రెండింగ్
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!