ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియాలో భారీ విధ్వంసం జరగబోతోంది. ఎలాంటి సౌండ్ లేకుండానే బ్లాస్టింగ్ చేయడం సందీప్ రెడ్డి వంగా స్టైల్. ఇప్పుడు తుఫాన్‌కు ముందు నిశ్శబ్దంలా స్పిరిట్ ఫస్ట్ లుక్‌ను రెడీ చేస్తున్నాడు. అసలే సందీప్ రెడ్డి హీరోలు చేసే అరాచకం మామూలుగా ఉండదు. అలాంటిది.. పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్‌తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా? అని మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
2026 న్యూ ఇయర్ గిఫ్ట్‌గా స్పిరిట్ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడా సమయం దగ్గర పడింది. మిడ్ నైట్ ముహూర్తం పెట్టిన సందీప్.. ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చని తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రభాస్‌ను చూడని లుక్‌లో చూపించబోతున్నాడు సందీప్. సోషల్ మీడియా టాక్ ప్రకారం.. చేతిలో సిగార్‌తో షర్ట్‌లెస్‌గా బ్లడ్ బాత్ అనేలా ప్రభాస్ లుక్‌ని డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన పాత్రలన్నిటికంటే పూర్తి భిన్నంగా, రా అండ్ రస్టిక్‌గా డార్క్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్ అని అంటున్నారు.
Also Read: RR Captain 2026: యశస్వి జైస్వాల్ కాదు.. రాయల్స్ కెప్టెన్ రేసులో ఆ ఇద్దరే!
ఇప్పుడు ఫస్ట్ లుక్‌తోనే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించడానికి రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగా. దీంతో.. ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియా షేక్ అవుతుందని ట్రెండ్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. అయితే స్పిరిట్ ఫస్ట్ లుక్ ఒక్కటే కాదు.. రిలీజ్ డేట్ కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తంగా ప్రస్తుతం డిజిటల్ మీడియా మొత్తం స్పిరిట్ వైబ్‌లో ఉంది. మరి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎలాంటి సంచనలం సృష్టిస్తుందో చూడాలి.
