సూపర్ స్టార్, మహేష్ బాబు అంటే తెలుగు సినిమాలో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న హీరోలలో ఆయన కూడా ఒకరు. ప్రపంచంలోనే అత్యంత ఫ్యాషన్ సూపర్ స్టార్ కూడా మన బాబునే. యాదృచ్ఛికంగా, నిన్న రాత్రి అఖిల్ అక్కినేని వివాహ రిసెప్షన్‌లో ఆయన నాణ్యమైన స్టైలింగ్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అది కూడా మహేష్ తన భార్యతో డాటర్ సితార తో కలిసి రిసెప్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే
Also Read : Jyothika : ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో జ్యోతిక..
మహేశ్ ధరించిన ఫుల్ స్లీవ్ టీ-షర్ట్ చూడాటానికి సింపుల్ గా కనింపిచాడు. ప్రజంట్ఈ టీ-షర్ట్ చుట్టూ చాలా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే మహేష్ లుక్ చూశాకా అభిమానులు ఆగుతారా వెంటనే చెప్పండి.. సోషల్ మీడియా వినియోగదారులకు ఈ టీ-షర్ట్ వివరాలు పసిగట్టె పనిలో పడ్డారు. ఇది ప్రపంచ ప్రసిద్ధ లగ్జరీ బ్రాండ్ హెర్మ్స్ నుండి వచ్చిందని వారు కనుగొన్నారు. అందులోను ఈ టీ-షర్ట్ ధర చూసి కంగుతిన్నారు.. ఎందుకంటే దీని ధర రూ. 1.51 లక్షలు. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే రూ. 1,51,678. ప్రజంట్ ఈ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది.