తమిళనాడు నుంచి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కోలీవుడ్ సెలబ్రిటీలు అంతా ఏకమవుతున్నారు. తమిళ స్టార్ హీరోలతో పాటు దర్శకులు తదితర టెక్నీషియన్ లు కూడా తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు ఇస్తున్నారు.
తాజాగా ప్రముఖ తమిళ నటుడు శివ కార్తికేయన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను పర్సనల్ గా కలిసి విరాళంగా అందజేశారు. రూ. 25 లక్షల చెక్ ను కరోనా రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. ఈ జాబితాలోకి ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ కూడా చేరారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను ఈరోజు కలిసిన వెట్రిమారన్ రూపాయలు రూ. 10 లక్షల చెక్కును కరోనా రిలీఫ్ ఫండ్ కి అందజేశారు.
ఇక ఇప్పటికే రజనీకాంత్, అజిత్, సూర్య ఫ్యామిలీ, జయం రవి ఫ్యామిలీ కూడా తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ వంతు విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే.