ప్రజెంట్ ఏ సినిమా థియేటర్లలో విడుదలైన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాదు, మంచి కంటెంట్ ఉన్న ఫ్యామిలీ డ్రామాలు, లవ్ స్టోరీస్ కూడా డిజిటల్ ప్లాట్‌ఫాంలలో మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా మరో చిత్రం చేరబోతోంది. తమిళంలో తాజాగా విడుదలైన ‘తలైవా తలైవి’ ఈ సినిమా, తెలుగులో ‘సార్ మేడమ్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి – నిత్యా మీనన్ హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా ఊహించని విధంగా, ఫ్యామిలి ప్రేక్షకులను విశేశగా ఆకట్టుకుంది. ఇక థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ వేదిక పై వినోదం పంచేందుకు సిద్ధమవుతోంది.
Also Read : Surya 47 : ఆ మలయాళ దర్శకుడితో సూర్య కొత్త సినిమా?
తాజా సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 22 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యోగిబాబు, రోషిని హరిప్రియన్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
కథేమిటంటే..
ఆకాశవీరయ్య (విజయ్ సేతుపతి) పరోటా మాస్టర్. తన కుటుంబంతో కలిసి స్వగ్రామంలో హోటల్ నడుపుతూ సంతోషంగా జీవిస్తుంటాడు. ఇలాంటి సమయంలో, పక్క ఊర్లో రాణి (నిత్యా మేనన్) అనే అమ్మాయితో అతనికి పెళ్లి సంబంధం వస్తుంది. పెళ్లి చూపుల్లోనే రాణి పట్ల వీరయ్యకు గాఢమైన ప్రేమ కలుగుతుంది. మొదట ఇరు కుటుంబాలు ఈ పెళ్లికి అంగీకరించిన, వారు ఊర్లో పెద్ద రౌడీలు అని బయటపడిన తర్వాత పెద్దలు వెనక్కి తగ్గుతారు. కానీ ప్రేమలో మునిగిపోయిన వీరయ్య – రాణి ఎవరి మాట వినకుండా పారిపోయి పెళ్లి చేసుకుంటారు. మొదట్లో సాఫీగా సాగిన వారి వైవాహిక జీవితం, క్రమంగా విభేదాలతో నిండిపోతుంది. చిన్న గొడవలు పెద్ద సమస్యగా మారి, చివరికి ఇరు కుటుంబాలను ప్రభావితం చేస్తాయి. ఇక చివరికి విడాకుల దిశగా వెళ్లిన వీరయ్య – రాణి, మళ్లీ కలిశారా? లేక విడిపోయారా? అనేది ఈ చిత్రంలో ఆసక్తికరమైన మలుపు.