Simbaa: ఓటీటీలో రచ్చ రేపుతున్న ‘సింబా’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simbaa getting Huge Response in Prime Video and Aha Video: వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్టుతో సింబా అనే సినిమా చేశారు. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన సింబా సినిమాతో మురళీ మనోహర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో అనసూయ, జగపతి బాబు, వశిష్ట, శ్రీనాథ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించగా ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా థియేటర్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రశంసలు వస్తాయి కానీ థియేటర్లో ఆడియెన్స్ నుంచి అంతగా రెస్పాన్స్ రాదు కానీ అలాంటి చిత్రాలనే ఓటీటీలో రిలీజ్ చేస్తే టాప్‌లో ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా సింబా మూవీ కూడా ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్, ఆహాలో ఈ సింబా మూవీ గత పది రోజులుగా ట్రెండింగ్‌లో ఉందని మేకర్స్ వెల్లడించారు.
Wolf Attack: యూపీలో నరమాంస భక్షక తోడేళ్లు.. 13 ఏళ్ల బాలుడిపై దాడి..
Also Read
ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 6లో సింబా చిత్రం ట్రెండ్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలతో ప్రకృతి విలయతాండవం చేస్తున్న టైంలో సింబాలోని డైలాగ్స్, సీన్స్ బాగానే వైరల్ అయ్యాయని చూపొచ్చు. చెట్లను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉంది? ఎందుకు ఉంది? అనేది సింబాలో చక్కగా చూపించారు. ఇక డైరెక్టర్ మొదటి సినిమాతోనే మంచి మెసెజ్ ఇచ్చే చిత్రాన్ని తీశారని సినిమాకు ప్రశంసలు దక్కాయి. సంపత్ నంది కథ.. డైరెక్టర్ మురళీ మనోహర్ విజన్, మేకింగ్ కు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ఫిదా అవుతున్నారని అందుకే. సింబాకి ఓటీటీలో ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోందని వెల్లడించారు. ఓటీటీలోకి కొత్త చిత్రాలు వస్తూ ఉన్నా కూడా సింబా ఇప్పటికీ టాప్‌లోనే ట్రెండ్ అవుతోందని వారు ప్రకటించారు.
- Tags
- aha video
- Prime Video
- Simbaa
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!