Siddharth : మిడిల్ క్లాస్ కథా నేపథ్యంతో వస్తున్న సిద్దార్ధ్ ‘3BHK’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో సిద్ధార్థ్ కు ఒకప్పడు అటు తమిళ్, ఇటు తెలుగులో సూపర్బ్ మార్కెట్ ఉండేది.. తెలుగులోనే ఇంకాస్త ఎక్కువ ఉండేది అని కూడా చెప్పొచ్చు. ఈ హీరో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిళ్లు వంటి సినిమాలు 175 డేస్ ఆడిన రోజలు ఉన్నాయి. ఒకప్పుడు సిద్దార్ధ్ సినిమా అంటే మినిమమ్ ఓపెనింగ్ ఉండేది. కానీ అదంతా గతం ఇప్పుడు ఈ హీరో సినిమా అంటే కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావు అనేది ఒప్పుకోవాల్సిన సత్యం. ఆ మధ్య వచ్చిన చిన్ని హిట్ అయింది తప్ప మిగిలిన సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెల్లయో కూడా తెలియదు.
Also Read
- Impure : పెళ్లి కూతురు 'కన్య' కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఇంప్యూర్'!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
అయితే హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు సిద్దార్ధ్. తాజాగా సిద్దు తన లేటెస్ట్ సినిమాను అనాన్స్ చేసాడు. శ్రీ గణేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘3BHK’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్టు అర్థమవుతుంది. ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్ చూస్తే హిట్ కళ కనిపిస్తోంది, ఈ సినిమాతో అయిన సిద్దార్ధ్ హిట్ ట్రాక్ లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకు అమ్రిత్ రామ్‌నాథ్ సంగీతం అందిస్తుండగా అరుణ్ విశ్వ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
తాజావార్తలు
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!