‘సలార్’లో శృతి హాసన్ పాత్ర ఇదే…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ ఆధ్వర్యంలో విజయ్ కిరాగండూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలలో విడుదల కానుంది. ‘సలార్’ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసింది. ఈ చిత్రం 2022 ఏప్రిల్ 14 న థియేటర్లలో విడుదల కానుంది. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో శృతి నటించబోయే పాత్ర గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం శృతి ఈ ‘సలార్’లో పొలిటికల్ జర్నలిస్ట్ పాత్రలో నటించనున్నారు. ఆమె పాత్ర ఒక ప్రముఖ టీవీ జర్నలిస్ట్ ఆధారంగా ఉంటుందని అంటున్నారు. ఇటీవలే ఈ బ్యూటీ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తానని వెల్లడించారు. ఇక 2021లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది శృతి. ఈ ఏడాది మొదట్లో ‘క్రాక్’తో హిట్ కొట్టిన శృతి హాసన్… ఇటీవల విడుదలైన ‘వకీల్ సాబ్’తో మరో హిట్ ను సాధించింది.
Also Read
- Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
- TFPC Elections : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు నిర్మాతల మధ్య వాగ్వాదం
- Nandamuri Mokshagna : నేడు చిన్న సింబా బర్త్ డే.. ఎంట్రీ అప్డేట్ ఉంటుందా ?
- Anushka Shetty : అనుష్క శెట్టి సినిమాలకు ఇక గుడ్‌బై చెప్పేసినట్టేనా?
- Tags
- prabhas
- salaar
- Shruti Haasan
తాజావార్తలు
-
Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం .. 209 విమానాలపై ప్రభావం!
-
Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
-
TFPC Elections : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు నిర్మాతల మధ్య వాగ్వాదం
-
JNU: జేఎన్ యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
-
Nandamuri Mokshagna : నేడు చిన్న సింబా బర్త్ డే.. ఎంట్రీ అప్డేట్ ఉంటుందా ?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!