కమల్ హాసన్ కన్నడ భాష పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. రీసెంట్‌గా బెంగళూరులో జరిగిన ‘థగ్ లైఫ్’ ఈవెంట్‌లో ‘కన్నడ భాష, తమిళ భాష నుంచి పుట్టింది..’ అంటూ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు, కన్నడ భాషను తక్కువ చేసేది గా ఉన్నాయని కన్నడిగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ వెంటనే క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, కర్ణాటకలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం కొలిక్కి రావడం పక్కన పెడితే.. ఇప్పుడు శివరాజ్ కుమార్ మెడకు చుట్టుకుంది..
Also Read : Dhanush : మీరు ఎన్ని కుట్రలు చేసిన నేను భయపడను..
ఎందుకంటే ఆ ఈవెంట్ కి శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అయితే కొందరు యాంటీ ఫ్యాన్స్ తమిళం నుంచి కన్నడ పుట్టిందనే కమల్ మాటలకు, శివ రాజ్‌కుమార్ క్లాప్స్ కొట్టాడనే రీతిలో వీడియోలు వైరల్ చేస్తూ.. సోషల్ మీడియాలో శివన్నను టార్గెట్ చేయడం మొదలయ్యింది. దీంతో తాజాగా శివరాజ్ కుమార్ స్పందించాడు.. ‘నేను అన్ని భాషలను ప్రేమిస్తాను, కానీ మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ నా మాతృభాషగా కన్నడకే ఇస్తాను. ఆ రోజు కమల్ హాసన్ తన ప్రసంగంలో ఒక బాబాయ్‌గా తన మీద అభిమానం చూపించడాన్ని స్వీకరిస్తూ చప్పట్లు కొట్టాను తప్పించి కన్నడ గురించి కాదు. ఎవరైనా కావాలని నా మీద బురద జల్లే ప్రయత్నం చేసినా. నా ప్రజలకు నేనేంటో తెలుసు’ అంటూ తెలిపాడు. ఇంత కాలం చాలా సౌమ్యుడిగా పేరున్న శివరాజ్ కుమార్ కు ఇప్పుడీ వ్యవహారమంతా పెద్ద తలనొప్పిగా మారింది.