Shiva Rajkumar: రామ్‌చరణ్‌కు నేషనల్ అవార్డ్ పక్కా.. ‘పెద్ది’పై కన్నడ సూపర్ స్టార్ శివన్న సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బెంగళూరులో జరిగిన ‘పెద్ది’ చిత్ర ప్రెస్ మీట్లో శివరాజ్‌కుమార్ పాల్గొని రామ్ చరణ్, మెగా ఫ్యామిలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శివన్న మాట్లాడుతూ.. రామ్ చరణ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎంతో కష్టపడి ఈ స్థాయికి రీచ్ అయ్యారని కొనియాడారు. “చరణ్ మొదటి సినిమా నుంచి నేటి వరకు చూపిస్తున్న సిన్సియారిటీ, హార్డ్ వర్కే అతడిని గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. దీని వెనుక ఆయన తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు బాబాయ్ పవన్ కళ్యాణ్ ఆశీస్సులు కూడా ఉన్నాయి” అని అన్నారు. ఒక ఫంక్షన్లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌ల మధ్య ఉన్న అఫెక్షన్ చూసి తాను ఎమోషనల్ అయ్యానని, తన తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్‌ను తాను ఎలా చూసుకునేవాడినో, పవన్ కళ్యాణ్ కూడా చరణ్‌ను అలాగే చూసుకుంటారని శివన్న గుర్తుచేసుకున్నారు.
‘పెద్ది’తో నేషనల్ అవార్డ్ రావాలి
దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ కథను, రామ్ చరణ్ క్యారెక్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేశారని శివరాజ్‌కుమార్ ప్రశంసించారు. “ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు కచ్చితంగా నేషనల్ అవార్డ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆ రేంజ్లో ఉంటాయి. సినిమాలో మా ఇద్దరి మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్, ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి” అని నమ్మకం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని శివన్న తెలిపారు. ఒకసారి చిరంజీవి బర్త్‌డే సందర్భంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్‌కు వెళ్లి తాను స్వయంగా రక్తం ఇచ్చానని చెప్పారు. ‘పెద్ది’ సినిమా కేవలం ఆటల చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదని, ఇందులో ప్రతి ఒక్కరిని కదిలించే బలమైన హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయని పేర్కొన్నారు. ఒక మనిషి జీవితానికి, ఆటకు ఉన్న కనెక్షన్ ఏంటి? అసలు ఎందుకోసం ఆడాలి? అనే పాయింట్‌ను బుచ్చిబాబు చాలా డీటెయిలింగ్‌తో పెద్దిని తెరకెక్కించారని, జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Jananayagan : విజయ్ 'జననాయకుడు' ఓవర్సీస్ రివ్యూ.. వద్దు బ్రో
- 2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
- Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
- Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
తాజావార్తలు
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
-
India vs Zimbabwe: ఇంగ్లండ్‌లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్‌లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!