Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం

Shalini Pandey

Shalini Pandey

AI టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తూ సినీ ప్రముఖులపై వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్న తీరు రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తన పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక మార్ఫింగ్ (AI-Generated) ఫేక్ వీడియోపై నటి షాలిని పాండే తమ సోషల్ మీడియా అధికారిక ఖాతాల ద్వారా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో సృష్టించిందే తప్ప అందులో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు.

ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఇలా టెక్నాలజీని వాడటం తీవ్రమైన మానసిక క్షోభను కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యలను ఏమాత్రం సహించకూడదని, సాధారణ విషయంగా తీసుకోరాదని ఆమె పేర్కొన్నారు.
నెటిజన్లు, అభిమానులకు ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు. ఆ ఫేక్ వీడియో ఎక్కడైనా కనిపిస్తే దాన్ని ఎవరికీ ఫార్వర్డ్ చేయవద్దు, డౌన్‌లోడ్ చేయవద్దు, షేర్ చేయవద్దు. ఆ పోస్ట్‌లతో ఎలాంటి ఎంగేజ్‌మెంట్ పెట్టుకోకుండా వెంటనే సంబంధిత ప్లాట్‌ఫామ్‌లలో రిపోర్ట్ చేయండి. తప్పుడు కంటెంట్‌ను వ్యాప్తి చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించి, దాని సర్క్యులేషన్‌ను అడ్డుకోవడంలో సహకరించండి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను నిరోధించడానికి ప్రతి ఒక్కరూ సంయమనం, బాధ్యత పాటించాలని ఆమె కోరారు.