కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గడంతో సినిమా షూటింగులు తిరిగి ప్రారంభిస్తున్నారు మేకర్స్. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తాను హీరోగా నటిస్తున్న “పఠాన్” సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోని వైఆర్ఎఫ్ స్టూడియోలో రీస్టార్ట్ అయ్యింది. ఇక్కడ జరగనున్న 15 నుంచి 18 రోజుల పాటు ఉండే ఈ షెడ్యూల్ లో షారుఖ్ ఖాన్ పాల్గొననున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్లో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, జాన్ అబ్రహం కూడా చేరతారు. ఈ షెడ్యూల్ లో మేజర్ పార్ట్ షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. ఆ తరువాత భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఈ టీం త్వరలోనే విదేశాలకు వెళ్లనుంది.
Read Also : ‘అందరూ బావుండాలి…’ థియేటర్‌లో మనందరం ఉండాలి: ప్రభాస్
ఇక ఈరోజు మరో విశేషం ఏమంటే… షారుఖ్ తొలి చిత్రం “దీవానా” విడుదలై నేటితో 29 సంవత్సరాలు పూర్తవుతోంది. కాగా “పఠాన్” చిత్రంతో మూడేళ్ల విరామం తర్వాత షారుఖ్ ఖాన్ తిరిగి నటిస్తున్నారు. ఆయన చివరిసారిగా 2018లో వచ్చిన “జీరో”లో కన్పించారు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్, అనుష్క శర్మ హీరోయిన్లుగా నటించారు. చాల గ్యాప్ తరువాత వెండి తెరపై కనిపించబోతున్నారు షారుఖ్.