60 ప్లస్ లో హీరోలు ఏం చేస్తారు. మహా అయితే తండ్రి, క్యారెక్టర్ ఆర్టిస్టుగానో స్థిరపడిపోవాల్సిందే. అది ఒకప్పటి మాట. కానీ ఇప్పటి సీనియర్ హీరోలు జూనియర్లకు సరికొత్త లెసన్స్ నేర్పిస్తున్నారు. వంద కోట్లు కొట్టడమే గొప్ప ఎచీవ్ మెంట్ అనుకుంటున్న సౌత్ ఇండస్ట్రీలో నయా రికార్డులు సృష్టిస్తున్నారు. 70 ప్లస్ లో రజనీ, కమల్ లాంటి కోలీవుడ్ స్టార్ హీరోలు రూ. 500 క్రోర్ కలెక్షన్లను చూపించి హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు.
Also Read : Coolie : కూలీ క్లైమాక్స్ లో రోలెక్స్.. కానీ సూర్య కాదు..
రోబో 2.0, జైలర్‌తో రూ. 600 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన రజనీకాంత్. జూనియర్ల ముందు బిగ్ టార్గెట్ ఉంచాడు. ఇప్పటి వరకు ఈ మార్క్ టచ్ చేసిన మొనగాడు కోలీవుడ్ లో లేడు. విజయ్, అజిత్ లాంటి తన ఫాలోవర్లు కూడా ఈ టార్గెట్ టచ్ చేసేందుకు అవస్థలు పడుతున్నారు. ఇక 70ల్లోకి ఎంటరైన కమల్ కూడా విక్రమ్ తో రూ. 450 – రూ. 500 కోట్లను కొల్లగొట్టి మళ్లీ తన హవా చూపించాడు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో నాలుగు పిల్లర్లుగా భావించే బాలయ్య, వెంకీమామ వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. ఇక సంక్రాంతికి వస్తున్నాంతో రూ. 300 కోట్లను క్రాస్ చేసిన తొలి సీనియర్ హీరోగా నిలిచి సరికొత్త రికార్డును సృష్టించాడు వెంకీ. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాతో చిరు, కూలీ సినిమాతో నాగ్ కూడా హిట్ కొట్టి ఈ రేస్ లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. అటు మళయాలం కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ తుడరుమ్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ముమ్మట్టి కూడా సూపర్ హిట్ సినిమాలతో జెట్ స్పీడ్ లో వెళ్తున్నారు. ఇలా ఈ హీరోలందరూ 60 ఏళ్ల వయసులో కూడా కుర్రహీరోలకు సవాల్ విసురుతున్నారు.
