వెండితెరపై ఫెరోషియస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ చేసి మెప్పించిన డాక్టర్ రాజశేఖర్ కెరీర్ కొంతకాలంగా నత్తనడకన సాగుతోంది. ఆ మధ్య కరోనా నుండి బయటపడిన రాజశేఖర్ వరుసగా మూడు చిత్రాలను అంగీకరించాడు. అయితే… వాటి షూటింగ్ స్టేటస్ ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే… గతంలో మల్టీస్టారర్ మూవీస్ కొన్ని చేసినా… ఆ తర్వాత రాజశేఖర్ సోలో హీరోగా సినిమాలు చేయడానికే ప్రాధాన్యమిచ్చారు. అయితే… తాజాగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.
Read Also : భారత హాకీజట్టుకు తారల అభినందనలు
గోపీచంద్ 30వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించబోతున్నాడు. దీనిని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మించబోతున్నాడు. గతంలో గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాలు సక్సెస్ కావడంతో సహజంగానే ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇందులో ఓ కీలక పాత్ర కోసం డాక్టర్ రాజశేఖర్ ను దర్శకుడు శ్రీవాస్ అప్రోచ్ కాగానే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. హీరోతో పాటు సరి సమానంగా ఆ పాత్రకు ప్రాధాన్యం ఉండటం ఒక కారణంగా కాగా, గోపీచంద్ తండ్రి ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ హీరోగా రాజశేఖర్ నిలబడటం కోసం గట్టి పునాదిని వేశారు. ఆ అభిమానంతోనూ రాజశేఖర్ ఈ మూవీ చేయడానికి అంగీకారం తెలిపారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… రాజశేఖర్ హీరోగా ‘మర్మాణువు, శేఖర్’తో పాటు మరో సినిమా ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. దీనితో పాటే రాజశేఖర్ ఓ తమిళ సినిమాలోనూ కీలక పాత్ర చేయబోతున్నట్టు సమాచారం.