Seetha Payanam : ‘పయనమే’ అంటూన్న అర్జున్ కూతురు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు.
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు వదిలిన కంటెంట్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ క్రమంలో ‘పయనమే’ పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటను కాసర్ల శ్యాం రచించారు. అనూప్ రూబెన్స్ అందించిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఈ మెలోడియస్, రొమాంటిక్ పాటను అనూప్ రూబెన్స్, సత్య ప్రకాష్ కలిసి ఆలపించారు. ఇక ఈ పాటలో అర్జున్, అనూప్ రూబెన్స్ కనిపించి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీని కూడా ఈ లిరికల్ వీడియోలో చక్కగా చూపించారు. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాల్ని కూడా వినూత్నంగా చేపట్టారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
Also Read
- Tags
తాజావార్తలు
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!