జూలై 31న విడుదలైన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘కింగ్‌డమ్’ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. విజయ్ దేవరకొండ హీరోగా .. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, కన్నడ నటుడు వెంకటేష్, ముఖ్య పాత్రలో కనిపించిన ఈ సినిమాలో, ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా విజయ్ అన్నగా కనిపించిన సత్యదేవ్ పాత్ర ప్రేక్షకుల హృదయాలను తాకింది. అన్నదమ్ముల అనుబంధం, ఎమోషన్, మాస్ యాక్షన్ అనే అన్ని అంశాలను మిళితం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యదేవ్ పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. దీంతో తాజాగా సత్యదేవ్ మీడియాతో ముచ్చటిస్తూ తన మనసులో మాటను పంచుకున్నారు..
Also Read: Jaaran : ఓటీటీలోకి అడుగుపెడుతున్న బ్లాక్ మ్యాజిక్, శాపాల ముడిపడిన ‘జారన్’..
“ఈ సినిమా నుంచి నాకు వచ్చిన ప్రేమను మాటల్లో చెప్పలేను. విజయ్ దేవరకొండతో పనిచేయడం ఒక గొప్ప అనుభవం. మా అన్నదమ్ముల బంధం స్క్రీన్ మీద కంటే బయట మరింత బలంగా ఏర్పడింది. ప్రేక్షకులు నా పాత్రను ఎంతగా కనెక్ట్ అయ్యారో చూసినప్పుడు నిజంగా ఎమోషనల్ అయ్యాను. ఈ సినిమా రిలీజైన దగ్గర నుంచి ఇప్పటివరకు నాకు వచ్చినంత ఫోన్ కాల్స్, మెసేజ్‌లు ఇంకెప్పుడూ రాలేదు. ఒక్కోషో ముగిసిన తర్వాత ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఇది చాలా స్పెషల్ ఫీలింగ్. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ కథ చెప్పిన వెంటనే ఎలాంటి లెక్కలు వేసుకోకుండా ఓకే చేశా. గౌతమ్ ఈ పాత్రకు కొన్ని పరిస్థితుల కారణంగా మధ్యలో వేరే నటులను కూడా కన్‌సిడర్ చేశారు. కానీ చివరికి నన్నే తీసుకోవడం.. ‘‘ప్రతి పాత్రకు పేరే రాసి ఉంటుంది’’ అనిపించింది. ముఖ్యంగా ప్రేక్షకులు ఇలా స్పందించడం అంటే.. నన్ను ఇంకా బెటర్‌గా పనిచేయాలని ప్రేరేపిస్తున్నది. నిజంగా ‘కింగ్‌డమ్’ నా కెరీర్‌లో ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుంది’ అంటూ సత్యదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ప్రేమను సత్యదేవ్ అందంగా అర్థం చేసుకుని కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి, ‘కింగ్‌డమ్’ హిట్‌తో సత్యదేవ్ కెరీర్ ఓ గడిలో పడిందని చెప్పొచ్చు.