జూలై 31న విడుదలైన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘కింగ్‌డమ్’ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. విజయ్ దేవరకొండ హీరోగా .. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, కన్నడ నటుడు వెంకటేష్, ముఖ్య పాత్రలో కనిపించిన ఈ సినిమాలో, ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా విజయ్ అన్నగా కనిపించిన సత్యదేవ్ పాత్ర ప్రేక్షకుల హృదయాలను తాకింది. అన్నదమ్ముల అనుబంధం,…