ఓ మారుమూల గ్రామంలోని పురాతన ఇంట్లో చోటుచేసుకునే భయానక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘జారన్’ సినిమా, థియేటర్లలో భారీ విజయం సాధించింది. చేతబడి, శాపాలు, బ్లాక్ మ్యాజిక్ వంటి మూఢ నమ్మకాల కథతో ప్రేక్షకులను మానసికంగా ఉలిక్కిపడేలా తెరకెక్కించారు. సస్పెన్స్, ఎమోషనల్, హారర్, మిస్టరీ అన్నింటినీ సమపాళ్లలో మిక్స్ చేసి.. ప్రతి ట్విస్ట్ దడ పుట్టించేలా ఉన్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల కోసం రెడీ అవుతోంది.
Also Read : OG : మరో మాస్ ట్రీట్‌కి రెడీ అయిన ‘ఓజి’ టీమ్ !
ఆగస్టు 8న జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. అమృత సుభాష్, అనిత, కిశోర్ వంటి నటులు ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కథలో ఒక యువతి తన కుటుంబంతో కలిసి ప్రశాంతంగా జీవితం సాగుతుంటుంది. కానీ అనూహ్యంగా భర్త చనిపోవడం, గతం నుంచి ఆమెను వెంటాడుతున్న శాపం మొదలవ్వడం, ఆ ఇంట్లో అజ్ఞాత శక్తుల ప్రభావం మొదలవడంతో కథ మలుపులు తిరుగుతుంది. చివరకు ఆ శాపం నుండి ఆమె బయటపడిందా? అసలు ఆ శాపం వెనుక ఉన్న నిజం ఏంటి? అనే ప్రశ్నలకు క్లైమాక్స్‌లో దిమ్మతిరిగే సమాధానాలు దాగున్నాయి.
ఈ సినిమాకు దర్శకత్వం వహించిన హృషికేష్ గుప్తే కథను కూడా తానే రాశారు. కథన శైలి, సెట్ డిజైన్, కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నింటి కలయికగా ఈ సినిమా అత్యున్నత స్థాయి హారర్ అనుభూతిని పంచుతుంది. అమృత సుభాష్, అనిత వంటి నటులు అందించిన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. ఈ సినిమా విడుదలకు ముందు విడుదలైన ట్రైలర్ విజువల్స్ ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. థియేటర్‌లో చూసే అవకాశం మిస్సయినవారికి, ఇప్పుడు జీ5 ఓటీటీ ద్వారా ఈ థ్రిల్లింగ్ అనుభవాన్ని ఆస్వాదించేందుకు అదిరే అవకాశం.