సారా అర్జున్ ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తండ్రి రాజ్ అర్జున్ కూడా సినీ నటుడే. ఒకటిన్నర ఏళ్ల వయసులోనే మొట్టమొదటి టీవీ యాడ్‌లో నటించింది సారా అర్జున్. 2011లో తమిళ దర్శకుడు ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన ‘దైవ తిరుమగల్’ చిత్రంలో విక్రమ్ కూతురుగా నీల అనే పాత్రలో నటించింది. మతిస్థిమితం లేని తండ్రి కూతురిగా ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి.
Also Read : Bollywood : ధురంధర్ సక్సెస్.. బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ నుండి వైదొలిగిన రణవీర్, అక్షయ్ కన్నా
నాన్న తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ, సారాకు తెలుగులో విశేష గుర్తింపు తెచ్చింది. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన దాగుడుమూత దండాకోర్ సినిమాలో సారా ‘బంగారం’ అనే క్యూట్ మనవరాలిగా నటించి మెప్పించింది. మళయాలంలో ఆన్ మరియా కలిప్పిలాను సినిమాతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత మణిరత్నం రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ (1 & 2)లో సారా అర్జున్ పోషించిన ఐశ్వర్యారాయ్ చిన్నప్పటి పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు 20 ఏళ్ల వయసులో ధురంధర్మూవీలో హీరోయిన్గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది సారా అర్జున్. స్టార్ హీరో రణవీర్ సింగ్ సరసన హీరోయిన్గా నటించి తన కెరీర్లో మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.