Santosh Soban New Movies: లైన్‌లో నాలుగు సినిమాలు.. సంతోష్ ‘బాబు’ బాగా బిజీ!
- మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి సంతోష్ శోభన్
- కెరీర్‌కు కొత్త ఊపు తీసుకొచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా
- నాలుగు సినిమాలు లైన్‌లో పెట్టిన సంతోష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Santosh Soban Upcoming Films: టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ 2023 తర్వాత కొంతకాలం విరామం తీసుకున్నప్పటికీ.. ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. ఇటీవల విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో.. ఆయన కెరీర్‌కు కొత్త ఊపు వచ్చింది. ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సక్సెస్‌తో సంతోష్ మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు.
కపుల్ ఫ్రెండ్లీ ప్రమోషన్ల సమయంలో చెప్పినట్లుగానే సంతోష్ శోభన్ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ అవుతున్నారు. ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో మల్టీ యూనివర్స్ కామెడీ సినిమా చేయడానికి సిద్ధమవ్వడం అభిమానుల్లో భారీ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు లక్షణ్ కే కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు రామ్ పసుపులేటి దర్శకత్వంలో ఒక ఫాంటసీ అడ్వెంచర్ మూవీ చేయడానికి కూడా సిద్ధమయ్యారు.
Also Read
- Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ 'బంగారం'!
- Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్'తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
- Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్‌కు పూనకాలే..
అంతేకాకుండా మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంతోష్ శోభన్ కొత్త కాన్సెప్ట్ కథలను ఎంపిక చేసుకుంటున్నారు. బ్రేక్ తర్వాత సంతోష్ కెరీర్ కొత్త స్పీడ్ అందుకుంది. వరుస ప్రాజెక్ట్‌లతో ఆయన అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కపుల్ ఫ్రెండ్లీ విజయంతో సంతోష్ నుంచి వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..