Site icon NTV Telugu

Sankranti Movies OTT Release: ఓటీటీలోకి సంక్రాంతి మూవీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే, మరోసారి పండగే!

Sankranti Movies Ott Release 2026

Sankranti Movies Ott Release 2026

2026 సంక్రాంతి పండగకు థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో చూడలేకపోయినవారికి, మరోసారి ఫేవరెట్‌ సినిమాలను ఆస్వాదించాలనుకునేవారికి ఇది డబుల్‌ ట్రీట్‌ అనే చెప్పాలి. ఫిబ్రవరి మొదటి వారం నుంచే సంక్రాంతి విడుదలైన మూవీస్ వరుసగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. దాంతో ఓటీటీ ప్రియులకు మరోసారి సంక్రాంతి పండగే.

సంక్రాంతి సినిమాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న మొదటి సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ చిత్రం ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక కథాంశంతో ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి స్పందన తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 6న ‘రాజాసాబ్‌’ మూవీ డిజ్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ ప్రారంభం కానుంది. సంక్రాంతి బరిలో ప్రత్యేక అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ ప్రియులను కూడా ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.

ఫిబ్రవరి 7న తమిళ మూవీ ‘పరాశక్తి’ జీ5 వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సామాజిక అంశాలు, భావోద్వేగాలతో కూడిన కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు ఆసక్తి పెరుగుతోంది. ఫిబ్రవరి 11న ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో బిట్ హిట్ అందుకున్న ఈ సినిమా.. ఓటీటీలో కూడా దూసుకుపోనుంది. ఫిబ్రవరి 13న రెండు సినిమాలు ఒకేసారి స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా జీ5లో విడుదల కానుండగా.. ‘అనగనగా ఒక రాజు’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ ప్రారంభం కానుంది. ఈ రెండు సినిమాలు కూడా విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి.

Also Read: T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌కు మెంటర్‌గా దినేశ్‌ కార్తిక్‌.. వాటే లక్కీ ఛాన్స్!

మొత్తంగా సంక్రాంతి సినిమాలతో ఫిబ్రవరి నెలంతా ఓటీటీలో పండగ వాతావరణం కనిపించనుంది. కుటుంబంతో కలిసి ఇంట్లోనే కూర్చొని సినిమాలను ఆస్వాదించే వారికి ఇది బెస్ట్‌ టైమ్‌ అని చెప్పాలి. థియేటర్‌ మిస్‌ అయినా, ఓటీటీ ద్వారా మరోసారి సంక్రాంతి ఫీల్‌ను ఎంజాయ్‌ చేయడానికి ఇదే మంచి అవకాశం.

Exit mobile version