Site icon NTV Telugu

Lokesh Kanagaraj: లోకేష్ కనగారాజ్’కి ఇక రక్త కన్నీరే?

Lokesh Kanagaraj

Lokesh Kanagaraj

లియోలో సంజయ్ దత్‌కు సరైన రోల్ దక్కలేదట.. అతడి టైంని వేస్ట్ చేశాడట.. ఇవీ పుకార్లు కాదండీ బాబు.. స్వయంగా సంజూనే ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు మున్నాభాయ్ రిగ్రెట్ ఫీల్ అయినట్లే.. ఫ్యూచర్‌లో ఆ యాక్టర్లు కూడా ఇదే ఫీలింగ్ వ్యక్తం చేయబోతున్నారా….? ఆ పాత్రలకు లోకీ న్యాయం చేస్తాడా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయానికి వస్తే రజనీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ కూలీ. వార్ 2కి పోటీగా ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. మల్టీస్టార్లర్లతో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. . సన్ పిక్చర్స్. లాల్ సలామ్, వెట్టయాన్ ప్లాప్స్ తర్వాత తలైవా నుండి వస్తున్న మూవీ కావడంతో పాటు లోకీ డైరెక్టన్ కావడంతో ఎక్స్ పర్టేషన్స్ స్కైని తాకుతున్నాయి. ఇప్పటికే రైట్స్ విషయంలో రికార్డులు మోత మోగిస్తోంది కూలీ. ఓవర్సీస్, తెలుగులో ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీ నెలకొనగా నాగ్ ఆశీస్సులతో టాలీవుడ్‌లో 80 కోట్లకు డీల్ కుదిరిందన్న టాక్ నడుస్తోంది. ఇక ఓవర్సీస్‌లో కూడా 86 కోట్లకు డీల్ క్లోజ్ అయ్యిందన్నది టాక్.

Also Read: Lenin : అఖిల్ లెనిన్ మూవీ అప్డేట్ – హీరోయిన్ ఛేంజ్ పై క్లారిటీ

ఇంకా సరిగ్గా నెల రోజులు బొమ్మ థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళుతోంది యూనిట్. ముందు చికిటు సాంగ్ రిలీజ్ చేయగా.. తాజాగా పూజా హెగ్డే మోనిక సాంగ్ వదిలింది. ఇక నెక్ట్స్ టీజర్, ట్రైలర్ రావడమే తరువాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు లోకేశ్ కనగరాజ్ పై సంజయ్ దత్ చేస్తున్న వ్యాఖ్యలు పలు క్వశ్చన్స్ రైజ్ అయ్యేలా చేస్తున్నాయి. కేడీ ద డెవిల్ ప్రమోషన్లలో పాల్గొన్న సంజయ్ దత్.. లోకేశ్ కనగరాజ్ పై మండిపడ్డాడు. లియోలో తనకు చిన్న పాత్ర ఇచ్చాడని, తనను సరిగ్గా వినియోగించుకోలేదంటూ కామెంట్స్ చేశాడు. అదే టైంలో రజనీ, కమల్ అంటే ఎంతో గౌరవం అని.. వాళ్లను చూస్తూ పెరిగానని, వాళ్ల నుండి నేర్చుకున్నానని అన్నాడు. కూలీ సినిమా కోసం కూడా ఎదురు చూస్తున్నానని చెప్పాడు.

Also Read: Rashmika: ‘యానిమల్’ లో రణబీర్ లాంటి వ్యక్తితో డేటింగ్ చేస్తా..

లియో విషయంలో ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాను అని బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో సంజయ్ దత్ ఫీలయ్యేలా చేశాడు లోకేశ్ కనగరాజ్. ఇప్పుడు ఆయన రిగ్రెట్ వ్యక్తం చేయడంతో పలు డౌట్స్ స్టార్టయ్యాయి. సంజూ తన పాత్రకే న్యాయం చేయలేదని ఫీలవుతుంటే.. కూలీలో రజనీ కాకుండా నలుగురు స్టార్ యాక్టర్లు ఉన్నారు.. నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహీర్ పరిస్థితి ఏంటీ..? వీళ్లకైనా మంచి రోల్ దక్కిందా? అన్న డౌట్ కలుగకమానదు. ఇప్పుడు సంజయ్ ఫీలైనట్లు.. ఈ వీరు ఎవ్వరూ భవిష్యత్తులో రిగ్రెట్ వ్యక్తం చేసే సిచ్యుయేషన్ లోకీ తెచ్చకోడూ కదా..? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ అదే జరిగితే వారిలో ఎవరైనా ఇలా అసంతృప్తి వెళ్ళగక్కితే నెక్స్ట్ సినిమా కాస్టింగ్ విషయంలో మనోడికి రక్త కన్నీరే. అయితే ఆ నలుగురు క్యారెక్టర్లకు న్యాయం చేశాడా లేదో తెలియాలంటే ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే.

### SEO Meta Description

### SEO Meta Keywords

Exit mobile version