కోలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శాండి మాస్టర్.. ఓన్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇప్పుడు తన ఐడెంటిటీని మాలీవుడ్, టాలీవుడ్‌కు విస్తరించుకున్నాడు. అతడు పేరు చర్చించుకునేలా చేస్తున్నాడు. రీసెంట్లీ కూలీలో మోనికాతో పాటు చిటుకు సాంగ్స్‌తో ఫేమ్ తెచ్చుకున్న శాండి .. గతంలో త్రిబుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాస్ స్టెప్పులేసి రాజమౌళి, చరణ్ , తారక్ ప్రశంసలు పొందాడు. తమిళ్, మలయాళంలో ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. అతడు కేవలం డ్యాన్స్ మాస్టరే కాదు.. అంతకు మించి యాక్టర్ కూడా. టివీల్లో డ్యాన్స్ షోలు చేసే స్థాయి నుండి యాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ముఖ్యంగా అతడు విలన్ రోల్స్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ పడినట్లే లెక్క.
Also Read :Manchu Manoj : సినిమా యుద్ధంలో గెలిచి విజయం సాధించా.. నా కల నెరవేరింది!
లోకేశ్ కనగరాజ్- విజయ్ దళపతి కాంబోలో వచ్చిన లియోలో కాపీ షాప్ సీన్‌లో భయపెట్టాడు శాండీ. ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు.. 600 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో కోలీవుడ్ ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో థర్డ్ ప్లేసులో ఉంది. ఇక రీసెంట్లీ మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు శాండీ. లోకలో కళ్యాణి ప్రియదర్శినీ, నస్లేన్ తర్వాత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ శాండిదే. ఓ వైపు పోలీసాఫీసర్‌గా.. మరో వైపు విలన్ రోల్ చేశాడు. కట్ చేస్తే ఈ సినిమా రూ. 250 కోట్లను కలెక్ట్ చేసి మాలీవుడ్ ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో సెకండ్ ప్లేసును ఆక్యుపై చేసింది.
Also Read :తెలంగాణలో NHAI ప్రాజెక్టుల సమీక్ష కోసం సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
మాలీవుడ్‌లో ఇలా హిట్ అందుకున్నాడో లేదో.. టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చేశాడు శాండి. కిష్కిందపురిలో మరోసారి విభిన్నమైన క్యారెక్టర్ చేసి భయపెట్టాడు. సెకండాఫ్‌లో అతడి నట విశ్వరూపాన్ని చూపించాడు. చెప్పాలంటే సినిమా మలి సగానికి బూస్టర్ అయ్యాడు. ఈ మూవీ కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. ఇటు కొరియోగ్రాఫర్‌గా.. ఇటు నటుడిగా మంచి మార్కులే కొట్టేస్తున్నాడు శాండీ.