NTV Telugu Site icon

Samyuktha : మలయాళీ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో లక్కీ ఛాన్స్..

Samyuktaa

Samyuktaa

ఒక సినిమా హిట్ అయితే చాలు నిర్మాతలు అందరు ఆ హీరోయిన్ వెంట పడతారు. అదే చేసిన రెండు మూడు సినిమాలు హిట్ అయ్యాయంటే గోల్డెన్ హీరోయిన్ గా ముద్ర వేస్తారు ఆడియెన్స్. అలా అటు ప్రేక్షకులతోను ఇటు నిర్మాతలతో గోల్డెన్ హీరోయిన్ అని పేరు తెచ్చుకుంది ఓ మలయాళీ ముద్దుగుమ్మ.  బింబిసార సినిమాతో హీరోయిన్ గా తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది సంయుక్త మీనన్. ఆ వెంటనే ధనుష్ టాలీవుడ్ డెబ్యూ సార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక సాయి ధరమ్ తేజ్ తో చేసిన విరూపాక్ష సినిమా సెన్సేషన్ హిట్ కొట్టడంలో సంయుక్త మీనన్ డే కీలక పాత్ర అని చెప్పక తప్పదు.

Also Read : Jr. NTR : వార్ -2 లో అడుగుపెట్టనున్న దేవర

ఇలా వరుస హిట్స్ తో ఈ మలయాళ ముద్దుగుమ్మకు గోల్డెన్ హీరోయిన్ అనే ముద్ర పడింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో మరొక లక్కీ ఛాన్స్ కొట్టేసింది సంయుక్త మీనన్. సంయుక్త మీనన్ హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమా నేడు గ్రాండ్ లాంఛ్ అవుతోంది. యోగేష్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. నేడు ఈ సినిమాకు సంబందించి పూజ కార్యక్రమాలను రామానాయుడు స్టూడియోలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రానా దగ్గుబాటి హాజరుకానున్నారు. గతంలో వీరిద్దరు కలిసి భీమ్లా నాయక్ లో జోడిగా నటించారు. రానాతో పాటుగా మరికొందరు దర్శకులు, నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.