Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మాజీ జంట నాగచైతన్య, సమంత విడిపోయి ఐదేళ్లు కావస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో ఇద్దరి వ్యక్తిగత జీవితాలు పూర్తిగా మారిపోయాయి. నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకోగా, సమంత దర్శకుడు-నిర్మాత రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందడుగు వేసి కొత్త భాగస్వాములతో హ్యాపీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం వీరి అభిమానుల మధ్య వార్, ట్రోలింగ్ అస్సలు తగ్గడం లేదు.
తాజాగా సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. నాగచైతన్యతో పెళ్లి సమయంలో శోభిత ధూళిపాళ్ల మాట్లాడుతూ.. “చైతు లేకపోతే నా లైఫ్ ఫుల్‌ఫిల్ అవ్వదు. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. అయితే, సమంత తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ థ్యాంక్స్ మీట్ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు దీనికి కౌంటర్ ఇచ్చేలా మాట్లాడిందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ ఈవెంట్లో ‘రిలేషన్షిప్స్ గురించి నేటితరం అమ్మాయిలకు మీరిచ్చే సలహా ఏంటి?’ అని సమంతను ప్రశ్నించగా.. ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also Read
“మనం పర్ఫెక్ట్గా లేకుండా.. ఎవరో ఒకరు వచ్చి మన జీవితాన్ని ఫుల్‌ఫిల్ చేస్తారని అనుకుంటే ఎలా? అలా అనుకోవడం వల్లే జీవితంలో తప్పులు జరుగుతాయి” అంటూ సమంత చెప్పుకొచ్చింది. సమంత చేసిన ఈ వ్యాఖ్యలు నేరుగా శోభితను టార్గెట్ చేస్తూ చేసినవేనంటూ నెటిజన్లు భావిస్తున్నారు. దీంతో ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ.. చైతు-సమంత అభిమానుల మధ్య మళ్లీ మాటల యుద్ధానికి తెరలేపాయి. కొంతమంది ఫ్యాన్స్ ఇరుపక్షాల పర్సనల్ లైఫ్‌లను లాగుతూ మరీ దిగజారి మాట్లాడుకుంటున్నారు.
నిజానికి డివోర్స్ తర్వాత నాగచైతన్య ఎప్పుడూ సమంతపై హుందాగానే మాట్లాడాడు. పలు ఇంటర్వ్యూలలో సమంత టాపిక్ వచ్చినప్పుడు.. “ఇలా జరగాల్సింది కాదు.. కానీ జరిగింది. మేమిద్దరం ఎంతో గౌరవంగా విడిపోయాం” అని క్లారిటీ ఇచ్చాడు. కానీ సమంత మాత్రం గతంలో పలు సందర్భాల్లో చైతూపై తన అసంతృప్తిని, కోపాన్ని బహిరంగంగానే బయటపెట్టింది. గతంలో ‘కరణ్ జోహార్ టాక్ షో’ లో పాల్గొన్నప్పుడు.. “జీవితంలో అవసరం లేకపోయినా ఎక్కువ ఖర్చు పెట్టిన సందర్భం ఏది?” అని అడిగితే.. “నా మాజీ భర్తకు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్స్” అని సామ్ సమాధానమిచ్చింది. అంతేకాదు “నేను, నా మాజీ ఒకే గదిలో ఉంటే.. మా పక్కన పదునైన కత్తులు ఉండకపోవడం మంచిది” అంటూ నవ్వుతూనే సీరియస్ కామెంట్స్ చేసింది. అప్పట్లో ఈ వ్యాఖ్యలను చైతు ఫ్యాన్స్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పుడు శోభిత వ్యాఖ్యలకు కౌంటర్‌గా సమంత మాట్లాడిందన్న వార్తలతో ఈ పాత గొడవలు మళ్లీ మొదటికి వచ్చాయి.
తాజావార్తలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
-
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!