Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్‌కు సమంత బంపర్ ఆఫర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విషయాలు నెట్టింట సంచలనంగా మారాయి. త్వరలో తన జీవితంలోకి రాబోతున్న బిడ్డ కోసం తాను ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తోందో చెబుతూ ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది సామ్. ఎంతో మంది తల్లులు మాతృత్వం గురించి పంచుకున్న అనుభవాలను వింటూ తన ప్రిపరేషన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బిడ్డ రాక కోసం ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారని ఓ నెటిజన్ అడగగా సమంత ఫన్నీగా బదులిచ్చింది. “నా బిడ్డకు కావాల్సిన అన్ని వస్తువులను ఇప్పటికే కొనేశాను. కానీ, అవన్నీ చూస్తుంటే నాకు లోపల ఎక్కడో తెలియని చిన్న భయం, యాంగ్జైటీ మొదలవుతోంది. అందుకే ప్రస్తుతానికి వాటన్నింటినీ ఒక బ్యాగ్‌లో సర్దేసి ప్యాక్ చేశాను. ఆశ్చర్యం ఏంటంటే.. ఇప్పుడు ఆ బేబీ బ్యాగ్‌ను నా ల్యాప్‌టాప్ పెట్టుకునే స్టాండ్‌గా వాడుకుంటున్నాను” అంటూ నవ్వులు పూయించింది.
మాతృత్వం తెచ్చే మార్పుల గురించి సామ్ మాట్లాడుతూ.. ఆ మధుర క్షణాల కోసం తాను ఆశగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. “బిడ్డకు పాలు పట్టడం, జోలపాటలు పాడి నిద్రబుచ్చడం లాంటివి ఇకపై నాకు ఫుల్ టైమ్ జాబ్‌లా మారనున్నాయి. అది నా జీవితాన్ని మార్చేసే ఒక అందమైన, అద్భుతమైన అనుభూతి” అని సమంత ఎమోషనల్ అయ్యింది. తల్లిగా మారితే మహిళల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని ఓ అభిమాని చెప్పగా.. “నిజంగా నేను ఎప్పుడూ ఆ కోణంలో ఆలోచించలేదు, నాకు ఒక మంచి విషయం చెప్పారు, థాంక్యూ” అంటూ సామ్ ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఈ సెషన్ మొత్తంలో హైలైట్ ఏంటంటే.. “మీ బేబీకి ఏ పేరు పెట్టబోతున్నారు?” అని అడిగిన ప్రశ్నకు సామ్ ఇచ్చిన సమాధానమే. “నిజంగా పేరును ఎంచుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఈ విషయంలో మీ అందరి సహాయం నాకు కచ్చితంగా కావాలి” అని సామ్ తన ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేసింది. దీంతో సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరోయిన్ బిడ్డకు ఎలాంటి పేరు సూచించాలా అని సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. మొత్తానికి సమంత ఫ్యాన్స్‌కి, మూవీ లవర్స్ కి ఇది ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న వార్త!
Also Read
- Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
- Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
- AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
- Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో 'ఇరుముడి' ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
తాజావార్తలు
-
Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్‌కు సమంత బంపర్ ఆఫర్!
-
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!