టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ‘శుభం’ మూవీతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. కామెడీ హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన ఈ మూవీలో ప్రతి ఒక్క పాత్రలో కొత్తవారే నటించారు. వారికి ఇది మొదటి సినిమానే అయినప్పటికి యాక్టింగ్ పరంగా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు.ఇందులో సామ్ ముఖ్యపాత్ర కూడా పోషించడం విశేషం. చాలా రోజుల తర్వాత అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది. ఇక దీంతో తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు.
Also Read : Gayatri : ప్రముఖ సింగర్ కన్నుమూత..
ఈ ఈవెంట్‌లో భాగంగా సమంత మాట్లాడుతూ..‘నిర్మాతలు ఇలా వరుసగా సినిమాలు ఎందుకు చేస్తారో ఇప్పుడు అర్థం అయ్యింది. ప్రేక్షకుల్ని నవ్వించాలన్నదే వారి లక్ష్యం. ఈ సినిమా షూటింగ్ టైంలో నాకు స్కూల్ డేలో సమ్మర్ హాలిడేస్ గుర్తుకొచ్చాయి. మాకు ఎలాగైనా సినిమా చూపించాలని మా అమ్మ తపన పడేది. థియేటర్‌లో సినిమా చూస్తూ అన్నయ్యతో గొడవపడటం.సినిమా చూసి ఇంటికొచ్చిన తర్వాత కూడా అదే పనిగా మూవీ గురించి చర్చించుకోవడం. అవన్నీ నాకు నిన్నే జరిగినట్టుగా అనిపిస్తున్నాయి. ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో నిర్మాణ సంస్థను స్థాపించాను.. ‘శుభం’తో అందరినీ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లాం. మేం ఇలాంటి మంచి చిత్రాలను తీసి ఫ్యామిలీస్‌ను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. మీ తీపి జ్ఞాపకాల్ని మళ్లీ మీకు గుర్తు చేస్తూనే ఉంటాం.. అదే మా ట్రాలాలా లక్ష్యం’ అంటూ చెప్పుకొచ్చింది.