చాలా కాలంగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ను ఆధారంగా చేసుకుని సినిమాలు తీయడానికి దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా అలాంటి ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తెలుగు వీర జవాన్, కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది. 2020లో గాల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో సంతోష్ బాబు ప్రాణాలు కోల్పోయారు.
Also Read : Vishal: హీరోయిన్ తో పెళ్లి.. ప్రకటించిన విశాల్
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సంతోష్ బాబు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జూలై 2025 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. 16వ బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన బిక్కుమళ్ల సంతోష్ బాబు నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సల్మాన్ ఖాన్‌కు ఈ సినిమా కథ బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం ఆయన శారీరక శిక్షణను కూడా ఇప్పటికే మొదలుపెట్టారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ లడఖ్‌లో జరగనుంది. కర్నూల్‌కు చెందిన తెలుగు వీరుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించడం ఆసక్తి రేకెత్తిస్తోంది.