Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్‌జాన్’కు ఏమైంది?

Salman Khan

Salman Khan

Viral Look: బాలీవుడ్ కండల వీరుడు, కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన భాయ్‌జాన్ తలపై క్యాప్ ధరించి కనిపించారు. అయితే వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోల్లో సల్మాన్ ఖాన్ గతంతో ఉన్నంత ఎనర్జీతో, స్టైల్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. గతంతో పోలిస్తే కాస్త నీరసంగా, వయసు పైబడినట్లుగా కనిపించడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజా వీడియోపై సోషల్ మీడియాలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది అభిమానులు ఇది వయసు ప్రభావం కావచ్చని కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు కొత్త సినిమా కోసం మేకోవర్ అయ్యి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ మార్పుపై సల్మాన్ ఖాన్ లేదా ఆయన టీమ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఏది ఏమైనా దాదాపు మూడు దశాబ్దాలుగా తన ఫిట్‌నెస్, స్టైలిష్ లుక్స్, సిక్స్‌ప్యాక్ బాడీతో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్‌ను ఇలాంటి రూపంలో చూడటం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఆందోళన కలిగిస్తోంది.