NTV Telugu Site icon

Salman Khan: సల్మాన్ ఖాన్ కృష్ణ జింక కేసులో మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు

Somy Ali Commets

Somy Ali Commets

లారెన్స్ బిష్ణోయ్ నుండి వచ్చిన హత్య బెదిరింపుల కారణంగా సల్మాన్ ఖాన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. దానికి తోడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ భద్రతను పెంచారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు నటి, సల్మాన్ మాజీ ప్రియురాలి సోమీ అలీ లారెన్స్ బిష్ణోయ్ అలాగే సల్మాన్ గురించి చాలా విషయాలు వెల్లడించారు. సోమి మాట్లాడుతూ, ‘నేను అప్పట్లో అవుట్‌డోర్ షూటింగ్‌కి వెళ్లేదానిని, కానీ ఈ సంఘటన జరిగినప్పుడు నేను అవుట్‌డోర్ షూటింగ్‌కి వెళ్లలేదు. అప్పట్లో సల్మాన్‌కి వేట అంటే చాలా ఇష్టం. ఆయనతో వెళ్ళినపుడు నేను జంతువులని చూసి దగ్గేదానిని వెంటనే అవి పారిపోయేవి, ఎందుకంటే నాకు వేట అంటే ఇష్టం లేదు అని ఆమె అన్నారు.

Actress Shabrin: మేనమామతో ప్రేమాయణం.. మేనల్లుడి కిడ్నాప్ కేసులో నటి అరెస్ట్

ఈ షూటింగ్ సమయంలో సల్మాన్ నన్ను తనతో తీసుకెళ్లలేదు, నేను నిన్ను వేటకు తీసుకెళ్ళను, లేకుంటే నీ వల్ల అవి పారిపోతున్నాయని సల్మాన్‌ చెప్పుకొచ్చాడని ఆమె అన్నారు. ఇక బిష్ణోయ్ కమ్యూనిటీలో కృష్ణజింకలను పూజిస్తారన్న విషయం సల్మాన్‌కు తెలియదని, అందుకే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని సోమీ పేర్కొన్నారు. తనకు తెలియని విషయానికి సల్మాన్ ఎందుకు క్షమాపణలు చెప్పాలి? తెలిసీ తెలియక ఏదో చేసినట్టు, బలవంతంగా క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు అని ఆమె అన్నారు. సల్మాన్ చాలా అహంకారి కానీ మంచి పేరు తెచ్చుకున్నాడని అంటున్నారు. ఈ రోజు నాకు అతనితో లేదా అతని కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదు. బాలీవుడ్‌లోనో, హాలీవుడ్‌లోనో ఎవరినీ హత్య చేయడం నాకు ఇష్టం లేదు, హింస ఎప్పుడూ పరిష్కారం కాదని అన్నారు.

సోమి అలీ మాట్లాడుతూ.. వేట జరిగిన ప్రదేశం 80 ఎకరాల్లో విస్తరించి ఉందని, అందుకే సల్మాన్ ఖాన్ మాత్రమే వేటకు వెళ్లారని, మరెవరూ అక్కడికి వెళ్లలేదని అన్నారు. అయితే సల్మాన్‌ స్టార్‌ కాబట్టి టార్గెట్‌ చేస్తున్నారు. కానీ చాలా మంది ప్రజలు వేటాడేందుకు ఆ ప్రదేశానికి వస్తారు. ఇప్పటివరకు ఇంకెవరూ కృష్ణ జింకను వేటాడలేదా? అని ఆమె పశ్నించారు. బిష్ణోయ్ కమ్యూనిటీ కృష్ణ జింకలను పూజిస్తారనే విషయం సల్మాన్‌కు తెలియదని అన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు సల్మాన్ తనతో కూడా మాట్లాడాడని సోమి అలీ వెల్లడించారు. బిష్ణోయ్ కమ్యూనిటీ కృష్ణ జింకను ఆరాధిస్తారనే విషయం తనకు తెలియదని సల్మాన్ ఖాన్ తనతో చెప్పినట్లు సోమీ తర్వాత వెల్లడించారు. సల్మాన్‌కి తెలియదని బిష్ణోయ్‌ వర్గీయులు అర్థం చేసుకోవాలని ఆమె అన్నారు.