బాలీవుడ్ స్టార్ హీరో కంగనా వీరుడు సల్మాన్ ఖాన్ తన సోదరులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న రేర్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 2018 సంవత్సరంలో నిర్వహించిన క్రిస్మస్ పార్టీలో బాలీవుడ్ తారలతో పాటు, సోదరులు సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేశారు. ఆ త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను మొదట సల్మాన్ ఖాన్ షేర్ చేశారు. ముందుగా ముగ్గురు సోదరులు డ్యాన్స్ చేస్తుండగా… సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కూడా వారితో కలిసి డ్యాన్స్ ఫ్లోర్‌లో చేరాడు.
Read Also : బాలకృష్ణతో మూవీ… స్పందించిన మెహ్రీన్
సోహైల్ నీలిరంగు టీ-షర్టు, జీన్స్ ధరించగా, అర్బాజ్ ఖాన్ చెక్స్ షర్టును ధరించాడు. మరోవైపు సల్మాన్ ఖాన్ చారల టీ షర్టు ధరించి డెనిమ్‌తో జత చేశాడు. ఇంకా 2018 క్రిస్మస్ పార్టీలో కరణ్ జోహార్, అతని కవలలు రూహి, యష్, షారూఖ్ ఖాన్ కుమారుడు అబ్రామ్, కత్రినా కైఫ్, తుషార్ కపూర్, అతని కుమారుడు లక్ష్యా, అమృత అరోరాలతో పాటు పలువురు హాజరయ్యారు. ఇక సల్మాన్ ఖాన్ ఇటీవలే “రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై విమర్శకులు పెదవి విరిచారు. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటించింది. ఈద్ కానుకగా విడుదలైన ‘రాధే’ పలు కాంట్రవర్సీల్లో కూడా చిక్కుకున్న విషయం తెలిసిందే.
A post shared by Salman Khan (@beingsalmankhan)