Site icon NTV Telugu

Saiyara : బాలీవుడ్ బడా స్టార్లకు షాకిచ్చేలా హీరోయిన్ తమ్ముడి మొదటి సినిమా ఓపెనింగ్స్

Saiyara

Saiyara

యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి రూపొందించిన రొమాంటిక్ డ్రామా ‘సైయారా’ జులై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాలీవుడ్‌లో తొలిసారి అడుగుపెడుతున్న అహాన్ పాండే(అనన్య పాండే సోదరుడు) ,అనీత్ పద్దా జంటగా నటించిన తొలి చిత్రం. ఈ కొత్త జంట నటించిన సినిమా అయినప్పటికీ, ‘సైయారా’ అడ్వాన్స్ బుకింగ్‌లో సంచలనం సృష్టించి, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ దిగ్గజాల చిత్రాల అడ్వాన్స్ బుకింగ్ రికార్డులను బద్దలు కొట్టింది.

Also Read : Pawan Kalyan: బర్త్ డే ట్రీట్ రెడీ?

సాక్నిల్క్ రిపోర్ట్ ప్రకారం, ‘సైయారా’ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్‌లో ఏకంగా ₹9.39 కోట్లు వసూలు చేసింది, ప్రీ-సేల్స్‌లోనే 3.8 లక్షల టిక్కెట్లు అమ్ముడవడం విశేషం. మిడ్-బడ్జెట్ చిత్రంగా, కొత్త నటీనటులతో రూపొందిన ఈ సినిమా ఈ స్థాయి విజయం సాధించడం నిజంగా ఆశ్చర్యకరం. జాన్వీ కపూర్ ‘ధడక్’ మొదటి రోజు మొత్తం కలెక్షన్ ₹8.76 కోట్లు, అలియా భట్, ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మొదటి రోజు కలెక్షన్ ₹3.75 కోట్లు కాగా, ‘సైయారా’ అడ్వాన్స్ బుకింగ్ ఈ రెండు చిత్రాల మొదటి రోజు కలెక్షన్లను అధిగమించింది.

Also Read : Vijay Deverakonda: హాస్పిటల్ లో అడ్మిటయిన విజయ్ దేవరకొండ?

ఈ సంవత్సరం విడుదలైన ఇతర ప్రముఖ చిత్రాలతో పోలిస్తే, అక్షయ్ కుమార్ ‘స్కై ఫోర్స్’ (₹3.78 కోట్లు), ‘కేసరి చాప్టర్ 2’ (₹1.84 కోట్లు), అజయ్ దేవ్‌గన్ ‘రైడ్ 2’ (₹6.52 కోట్లు), ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ (₹3.32 కోట్లు) అడ్వాన్స్ బుకింగ్‌లను కూడా ‘సైయారా’ మించిపోయింది. ఈ లెక్కలు చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ₹20-25 కోట్ల ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని సూచిస్తున్నాయి, ఇది 2025లో బాలీవుడ్‌లో నాల్గవ అత్యధిక ఓపెనింగ్‌ సాధించిన సినిమాగా నిలవనుంది.

Exit mobile version