ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల సేవలో నిమగ్నమై ఉన్న పవన్ కళ్యాణ్, పవర్‌స్టార్ గా తన సినిమా ప్రయాణాన్ని కూడా కొనసాగిస్తున్నారు. రాజకీయ బాధ్యతలతో పాటు, తన పెండింగ్‌లో ఉన్న సినిమాను పూర్తి చేయడంపై దృష్టి సారించిన పవన్, ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ ‘ఓజీ’ సినిమాల షూటింగ్‌ను విజయవంతంగా ముగించారు. ఇప్పుడు ఆయన పూర్తి దృష్టి హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై కేంద్రీకృతమైంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఈ నెలాఖరు నాటికి పూర్తవనుంది.
Also Read : Vijay Deverakonda: హాస్పిటల్ లో అడ్మిటయిన విజయ్ దేవరకొండ?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం తమిళ బ్లాక్‌బస్టర్ ‘థేరి’ నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, హరీష్ శంకర్ తనదైన శైలిలో ఈ కథను తెలుగు ప్రేక్షకులకు అద్భుతంగా అందించడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం 2026లో విడుదల కానుంది. ఇక అభిమానులకు శుభవార్తగా, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ ఒక చిన్న డైలాగ్ టీజర్‌ను విడుదల చేయనుందని అంటున్నారు. ఈ టీజర్ పవన్ ఫ్యాన్స్‌కు ఓ అద్భుతమైన బర్త్‌డే గిఫ్ట్‌గా నిలవనుందని సమాచారం. పవన్ కళ్యాణ్ డైలాగ్‌లు, ఆయన లుక్‌తో కూడిన ఈ టీజర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేయడం ఖాయం.