సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయితేజ్ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నట్టు సమాచారం. కొంతకాలం క్రితం విడుదలైన ‘రిపబ్లిక్’ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో విడుదల కానుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే జీ ఈ చిత్రం డిజిటల్ హక్కులను పొందింది. దీంతో సల్మాన్ ‘రాధే’ను విడుదల చేసినట్టుగా పే-పర్-వ్యూ బేస్ లో ‘రిపబ్లిక్’ విడుదలకు ప్రణాళికలు వేస్తున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి మేకర్స్ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరి “రిపబ్లిక్” విడుదలపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.