Sai Rajesh: ‘బేబి’మూవీ హిందీ రీమేక్‌పై.. ఇంట్రస్టింగ్ అప్‌డేట్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బేబీ’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహిరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రం యూత్‌కి మంచి మెసెజ్ ఇవ్వడంతో పాటు బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్‌లో రీమేక్‌కి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రిపరేషన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అందులో హీరోగా ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్ నటించాలి. అయితే ఇటీవల బాలీవుడ్ స్టార్స్ అనన్యా పాండే, సిద్ధార్థ్ చతుర్వేది తన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారని బాబిల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఎంత రచ్చకి దారి తీసిందో తెలిసిందే..
Also Read : Habit Effects: పిల్లల్లో ఈ అలవాటు చాలా ప్రమాదకరం..!
Also Read
దీంతో అనన్య, సిద్ధార్ధ్‌లని బాబిల్ అలా కామెంట్ చేయడం సాయి రాజేష్ కూడా ఖండించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆన్‌లైన్ వేదికగా చాలా డిస్కషన్ నడిచింది. దీంతో ‘సాయి రాజేష్ కోసం నా జీవితంలో రెండేళ్లు ఇచ్చాను, ఈ ప్రయాణంలో నాకు వచ్చిన అవకాశాలు వదులుకున్నా. సాయి రాజేష్ సర్‌కి, నాకు ఎంతో మంచి రిలేషన్ ఉంది.. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాను.. మళ్లీ భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నాను.. ఈ ప్రాజెక్ట్‌ను ఆయన విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను’ అని బాబిల్ ఖాన్ పోస్ట్ చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై రాజేష్ స్పందించారు.. ‘ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవాన్ని అంగీకరించక తప్పదు, కొన్ని రోజుల పాటు అతనితో ప్రిపరేషన్ వర్క్ చేశాం. మా హీరోని మిస్ అవుతున్నాము. అలాగే సెల్ఫ్ కేర్ ముఖ్యం, బాబిల్ ఖాన్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తాము. నా జీవితంలో నేను కలిసిన నటుల్లో బాబిల్ ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తి. త్వరలో అతనితో కలిసి మూవీ చేస్తా’ అని సాయి రాజేష్ పేర్కొన్నారు.
- Tags
- Babil
- baby
- Sai Rajesh
తాజావార్తలు
-
AUS vs BAN: మ్యాచ్ పోయే.. సిరీస్ పోయే.! ఆసీస్ పని అయిపోయిందా.?
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!