Sai Pallavi : వారి బాటలోనే సాయి పల్లవి.. హిట్టు దక్కేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరన్‌తో బాక్సాఫీస్ నయా క్వీన్‌గా మారిన సాయి పల్లవి.. ఆ నేమ్ సార్థకత చేసుకునేందుకు ట్రై చేస్తోంది. అనుష్క, నయనతార, సమంతలా ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు రెడీ అయ్యింది. తెలుగులో లేడీ ఓరియెంట్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గట్టిగానే బజ్ నడుస్తోంది. తండేల్ మూవీ రైటర్ కార్తీక్ తీర్థ చెప్పిన కథకు ఇంప్రెస్సైయ్యిందట ఈ డ్యాన్సింగ్ డాల్. ఆమె చుట్టూనే స్టోరీ తిరుగుతుందట. ఫీమేల్ ఓరియెంట్ లవ్ స్టోరీకి ఫిదా అయిపోయిందట భానుమతి.
ప్రేమమ్ తో పాపులారిటీ తెచ్చుకున్న సాయి పల్లవి తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. లేడీ ఓరియెంట్ చిత్రాలు చేయడం ఆమెకు కొత్త కాదు. కానీ టాలీవుడ్లో మాత్రం ఇదే మొదటి సినిమా. కెరీర్ స్టార్టింగ్ లో తమిళంలో కణంతో పాటు గార్గి లాంటి ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేసింది. ఈ రెండు కమర్షియల్ గా హిట్స్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులను తెచ్చిపెట్టాయి. కణం, గార్గి రిజల్ట్ చూశాక కూడా రిస్క్‌కు రెడీ అవుతుంది ఈ తమిళ పొన్ను. ప్రజెంట్ తెలుగులో ఆమె చేతిలో తండేల్ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. నాగ చైతన్యతో లవ్ స్టోరీతో హిట్టు అందుకున్న భామ తండేల్ తో మరోసారి అదుర్స్ అనిపించేందుకు ఫిక్స్ అయ్యింది. ఇవే కాకుండా బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న రణబీర్ రామాయణలో సీతగా, అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ కు జోడీగా మరో సినిమా చేస్తుంది. ఇవే కాకుండా కొత్త కథలను వింటున్నట్లు టాక్. లేడీ ఓరియెంటెడ్ సినిమా సాయి పల్లవికి హిట్ ఇస్తుందో రానున్నో రోజుల్లో తెలుస్తుంది.
Also Read
తాజావార్తలు
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్‌తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి