Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran – Tej Forever: మెగా కాంపౌండ్‌లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. సుప్రీమ్ హీరో సాయిదుర్గా తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కొన్నాళ్లుగా ఆయన పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న వేళ.. వాటన్నింటికీ చెక్ పెడుతూ సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. కిరణ్ అనే అమ్మాయితో తేజ్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. తేజ్ చేసుకోబోయే వధువు ఎవరు? ఎలా ఉంది? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఎలాంటి ఆర్భాటం లేకుండా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ నిశ్చితార్థ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోతున్న కొత్త జంటను చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. రామ్ చరణ్ స్వయంగా ఈ ఫోటోలను పంచుకుంటూ.. “”డియర్ తేజ్, కిరణ్.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మీ ఇద్దరి ప్రయాణం నిండు నూరేళ్లు ప్రేమ, సంతోషాలతో సాగిపోవాలని కోరుకుంటున్నాను.. మిమ్మల్నిద్దరినీ ఇలా చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది” అంటూ రామ్ చరణ్ #KiranTejForever హ్యాష్‌ట్యాగ్‌తో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.
Also Read
- Jailer 2 OTT Release Date: ఓటీటీలోకి రజనీకాంత్ మాస్ తాండవం.. ‘జైలర్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Dada Release Date: 'అఖండ 2' సీన్ రిపీట్ కానుందా? బాలయ్య 'దాదా'పై సస్పెన్స్!
- Journey of Ramayana: 1917 నుంచి 2026 వరకు.. వెండితెరపై 'రామాయణ' వందేళ్ల అద్భుత ప్రయాణం!
- Ramayana : 'రామాయణ' మొదలైందిలా... ముగింపులో మిగిలింది ఎవరు?
ఈ వేడుకలో రామ్ చరణ్‌తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మెగా, అల్లు హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించి తేజ్, కిరణ్ జంటను ఆశీర్వదించారు. బైక్ ప్రమాదం నుంచి కోలుకుని, మళ్లీ వెండితెరపై సత్తా చాటిన తేజ్.. ఇప్పుడు నిజజీవితంలో బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి కొత్త అడుగు వేస్తుండటంతో సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విషెస్ తెలియజేస్తున్నారు. ఈ జంట పెళ్లి తేదీకి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning ❤️
Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you!
#KiranTejForever https://t.co/eJ7g9I5S2X— Ram Charan (@AlwaysRamCharan) November 5, 2026
తాజావార్తలు
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
-
BrahMos Deal: డ్రాగన్ వెన్నులో వణుకు.. భారత్‌తో ఫిలిప్పీన్స్ భారీ బ్రహ్మోస్ డీల్! ఆట మొదలైంది..
-
APPSC Group 1 Evaluation Scam: ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఈడీ మెరుపు దాడులు.. కీలక ఆధారాల సేకరణ
-
Traffic Restrictions: దీపావళి వేళ చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!