కర్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది. చేసిన పాపం ఊరికే పోదు… అంటున్నాడు సచిన్ జోషి. తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసిన ఈ యాక్టర్ కమ్ బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాపై లీగల్ బ్యాటిల్ లో నెగ్గాడు. వారిద్దరి మధ్యా గత కొంత కాలంగా ‘ఎస్జీపీఎల్ సత్యయుగ్ గోల్డ్ స్కీమ్’ విషయంలో వివాదం నడుస్తోంది. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ‘సత్యయుగ్’ అనే కంపెనీకి చైర్మన్ గా వ్యవహరిస్తూ బంగారంపై ఆదాయం అందిస్తామంటూ అప్పట్లో స్కీమ్ ప్రకటించాడు. దాన్ని నమ్మి సచిన్ జోషి కొంత బంగారం వారి వద్ద ఉంచాడు. కానీ, అయిదేళ్ల నిర్ధిష్ట సమయం పూర్తయ్యాక సచిన్ కి రాజ్ కుంద్రా కంపెనీ నుంచీ బంగారం తిరిగి రాలేదు. కిలో బంగారం అలా తమ వద్ద ఉంచేసుకుని అడ్డగోలుగా ప్రవర్తించటంతో జోషి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది…
Read Also : పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూవీ… హైప్ పెంచేస్తున్న రచయిత
రాజ్ కుంద్రా తనని మోసం చేశాడని న్యాయస్థానానికి వెళ్లిన సచిన్ జోషీకి తాజాగా అనుకూల తీర్పు వచ్చింది. రాజ్ కుంద్రా 25లక్షల 50వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కర్మ… ఖర్మగా మారి… వెంటాడుతుందంటూ సచిన్ ఈ సందర్భంగా కామెంట్ చేశాడు. తమ లాగే ఎందరో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా పేర్లు చూసి మోసపోయారని కూడా అన్నాడు. తన 18లక్షలు విలువ చేసే బంగారం తిరిగి ఇవ్వటానికి కుంద్రా ఏర్పాటు చేసిన కంపెనీ వారు 25లక్షలు అడిగారనీ ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నాడు!
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా జూలై 19న నీలి చిత్రాల వ్యవహారంలో అరెస్ట్ అయ్యాడు. ఆయన ఆన్ లైన్ లో న్యూడ్ వీడియోస్ దందా చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. రాజ్ కుంద్రా పై కంప్లైంట్ చేసిన యువతి తనలాగే ఎందరో అమ్మాయిలు మోసపోయారని అంటోంది. పూనమ్ పాండే కూడా కుంద్రాపై చాలా రోజులుగా న్యాయపోరాటం చేస్తోంది. ఆమె ఫోటోలు, వీడియోలు అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ తరువాత కూడా వాడుకున్నారని ఆమె అంటోంది. మొత్తంగా చూస్తే, రాజ్ కుంద్రాతో పాటూ శిల్పా శెట్టికి బ్యాడ్ టైం నడుస్తున్నట్టే కనిపిస్తోంది. చూడాలి మరి, ముందు ముందు ఇంకెన్ని పాత కేసులు తిరగబెట్టబోతున్నాయో…